ఏడాదిగా ఫ్రిజ్‌లో న్యూడిల్స్‌.. తిని తొమ్మిది మంది మృతి

| Edited By:

Oct 21, 2020 | 5:16 PM

చైనాలో దారుణం చోటుచేసుకుంది. ఏడాదికి పైగా ఫ్రిజ్‌లో ఉన్న న్యూడిల్స్‌ తిని ఒకే ఇంట్లో తొమ్మిది మంది మరణించారు.

ఏడాదిగా ఫ్రిజ్‌లో న్యూడిల్స్‌.. తిని తొమ్మిది మంది మృతి
Follow us on

Nine family members die: చైనాలో దారుణం చోటుచేసుకుంది. ఏడాదికి పైగా ఫ్రిజ్‌లో ఉన్న న్యూడిల్స్‌ తిని ఒకే ఇంట్లో తొమ్మిది మంది మరణించారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. నార్త్‌ ఈస్ట్రన్‌ చైనీస్ ప్రాంతంలోని హెయిలోంగ్‌జియాంగ్‌లో అక్టోబర్ 5న ఓ కుటుంబంలో 12 మంది బంధువులు కలుసుకున్నారు. అందులో 9 మంది మొక్కజొన్న పిండితో చేసిన సున్‌ టంగ్ జి అనే ప్రత్యేక న్యూడిల్‌ డిష్‌ని తిన్నారు. దాన్ని ఏడాదిగా ఫ్రిజ్‌లో ఉంచగా.. మార్నింగ్ ఫుడ్‌ మీటింగ్‌లో తిన్నారు. వెంటనే ఆ తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. అందులో 7 మంది ఈ నెల 10న మరణించారు. ఇక ఈ నెల 12న ఒకరు, 19న మరొకరు మరణించారు. దీనిపై చైనీస్ హెల్త్‌ కమిషన్ జాతీయ హెచ్చరికను చేసింది. పులియబెట్టిన పిండితో చేసిన వంటలను తినడం మానేయాలని సూచించింది.

Read More:

అనిల్ రావిపూడికి ‘ఇండియన్ పనోరమ’ అవార్డు

కరోనా: 215 రోజుల తరువాత కలుసుకున్న వృద్ధ జంట.. భావోద్వేగ వీడియో వైరల్‌