కరోనా: 215 రోజుల తరువాత కలుసుకున్న వృద్ధ జంట.. భావోద్వేగ వీడియో వైరల్‌

మాయదారి కరోనా మహమ్మారితో ప్రపంచంలో అల్లకల్లోలమైంది. ఈ వైరస్ నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్ విధించడంతో

  • Manju Sandulo
  • Publish Date - 3:58 pm, Wed, 21 October 20

Old Couple reunite: మాయదారి కరోనా మహమ్మారితో ప్రపంచంలో అల్లకల్లోలమైంది. ఈ వైరస్ నేపథ్యంలో పలు దేశాలు లాక్‌డౌన్ విధించడంతో.. చాలా మంది వేరు వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారు. ఇక కరోనా రావడంతో కొంతమంది కుటుంబ సభ్యులకు దూరంగా ఆసుపత్రుల్లో రోజులు గడిపారు. అందులో కొందరు కోలుకొని ఇంటికి వచ్చినప్పటికీ.. ఇంకొంతమంది చివరి చూపు కూడా కుటుంబ సభ్యులకు దక్కలేదు. అయితే ఈ మహమ్మారి వలన దాదాపు 200 రోజులకు పైగా దూరంగా ఉన్న ఓ వృద్ధ జంట ఇటీవల కలుసుకున్నారు. దీంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు ముద్దాడుకుంటూ తమ ప్రేమను చాటుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. జోసెఫ్, ఈవ్‌ లొరేత్‌ ఇద్దరికి 61 సంవత్సరాల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. అయితే కరోనా రావడంతో జోసెఫ్‌ మార్చిలో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన కాలును కూడా తీసేశారు. అయితే కఠిన నిబంధనలు ఉండటంతో అతడిని చూసేందుకు ఈవ్‌కి కుదరలేదు. ఇక ఈవ్‌ కూడా ఆగష్టులో ఆసుపత్రిలో చేరారు. ఇలా ఒకే ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు చూసుకొని, కలుసుకోలేకపోయారు. అయితే రోజు వారు ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఇక ఇటీవల ఈ ఇద్దరు పూర్తిగా కోలుకోవడం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు ఐ లవ్‌ యు, ఐ మిస్ యు అంటూ ఒకరిపై ఒకరి ప్రేమను చాటుకోగా.. ఆ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read More:

Bigg Boss4: మోనాల్, అవినాష్‌ రొమాన్స్‌.. సచ్చిపోండి మీరిద్దరు అన్న అరియానా

సుశాంత్ కేసు: షోవిక్‌ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు