క్లైమేట్ ఎమర్జన్సీకోసం .. వెల్లువెత్తుతున్న నిరసనలు..

పర్యావరణ పరిరక్షణకోసం మెల్లగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో బుధవారం ప్రజలు భారీ ప్రదర్శన చేశారు. వాతావరణ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఉదయ్మకారులు పోటెత్తారు. దీంతో ఈ సిటీలోని పాలకవర్గం క్లైమేట్ ఎమర్జన్సీని ప్రకటించింది. మొదట దీనిపై కౌన్సిల్ లో బిల్లు ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించగానే సులభంగా బిల్లు నెగ్గింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలుపుతూ బల్లలు చరిచారు. కాలుష్యపూరిత వాయువులను తగ్గించేందుకు యుధ్ధప్రాతిపదికన చర్యలు […]

క్లైమేట్ ఎమర్జన్సీకోసం .. వెల్లువెత్తుతున్న నిరసనలు..
Follow us

|

Updated on: Jun 27, 2019 | 12:40 PM

పర్యావరణ పరిరక్షణకోసం మెల్లగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో బుధవారం ప్రజలు భారీ ప్రదర్శన చేశారు. వాతావరణ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఉదయ్మకారులు పోటెత్తారు. దీంతో ఈ సిటీలోని పాలకవర్గం క్లైమేట్ ఎమర్జన్సీని ప్రకటించింది. మొదట దీనిపై కౌన్సిల్ లో బిల్లు ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించగానే సులభంగా బిల్లు నెగ్గింది. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలుపుతూ బల్లలు చరిచారు. కాలుష్యపూరిత వాయువులను తగ్గించేందుకు యుధ్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ నిరసనకారులు కోరారు. ప్రపంచంలో ఇలా హానికారక వాయువులను వెదజల్లుతున్న 20 టాప్ దేశాల్లో అమెరికా కూడా ఒకటి. 2012 లో న్యూయార్క్ లో సూపర్ శాండ్ స్టార్మ్ (ఇసుకతుఫాను) కారణంగా పెద్దఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. సబ్ వేలతో బాటు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరదనీటితో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదంతా క్లైమేట్ ప్రొటెక్షన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకొని ఫలితమేనని అప్పట్లో వార్తలు వచ్చ్చాయి. నాలుగు దేశాలు… బ్రిటన్, ఐర్లాండ్, కెనడా, ఫ్రాన్స్ ఇప్పటికే క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. 15 దేశాల్లో 650 కి పైగా మున్సిపాలిటీలు ఇదే ప్రకటన చేశాయి. వీటిలో ఓక్లాండ్, షాన్ ఫ్రాన్సిస్కో వంటివి కూడా ఉన్నాయి. ఎత్తయిన భవనాలు, ఫ్యాక్టరీలనుంచి వెలుబడుతున్న కార్బన్ డై ఆక్షైడ్ వంటి విషవాయువులు మానవాళికి తెస్తున్న చేటు ఇంతాఅంతా కాదని ఉద్యమకారులు అంటున్నారు. పారిస్ అగ్రిమెంట్ ప్రకారం మొత్తం 197 దేశాలు ఇందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవలసి ఉంది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు