New York Floods: న్యూయార్క్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. నదులను తలపిస్తున్న రోడ్లు, జనజీవనం అస్తవ్యస్తం..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్ లో ఉంటూ వరదలతో విమానాశ్రయాలు, సబ్ వేలు, వీధులు, రోడ్లు ముంచెత్తడం.. వాటిలో చెప్పు లేకుండా నడవడం తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇదేం కర్మ అని మేయర్ ఎరిక్ అడమ్స్ ను ప్రశ్నించారు డెమాక్రాట్లు.. న్యూయార్క్ సిటీ అభివృద్దికి కావాల్సిన నిధులు ఉన్నప్పటికీ నిర్వాసితుల సంరక్షణ, భద్రతను మేయర్ గాలికొదిలేశారని.. వెరీ షేమ్ ఫుల్.. అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

New York Floods: న్యూయార్క్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. నదులను తలపిస్తున్న రోడ్లు, జనజీవనం అస్తవ్యస్తం..
New York Floods

Updated on: Oct 01, 2023 | 6:32 AM

అమెరికాలోని న్యూయార్క్ ను వరదలు ముంచెత్తాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో డ్రైనీజీ వ్యవస్థ ఉప్పొంగి న్యూయార్క్ వీధులు, పాఠశాలలు, సబ్ వేలు, రహదారులు జలమయమయ్యాయి. న్యూయార్క్ నగరాన్ని వరదలు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అక్కడి అడ్మినిస్ట్రేషన్ అసహనం వ్యక్తం చేశారు. వర్షాలు, వరదల కారణంగా న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బలమైన తుఫాను నగరంలో విధ్వంసం సృష్టించింది. హైవే నుంచి ఎయిర్‌పోర్టు వరకు అన్నీ నీటిలోనే మునిగిపోయాయని నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం న్యూయార్క్ లో ఉంటూ వరదలతో విమానాశ్రయాలు, సబ్ వేలు, వీధులు, రోడ్లు ముంచెత్తడం.. వాటిలో చెప్పు లేకుండా నడవడం తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇదేం కర్మ అని మేయర్ ఎరిక్ అడమ్స్ ను ప్రశ్నించారు డెమాక్రాట్లు.. న్యూయార్క్ సిటీ అభివృద్దికి కావాల్సిన నిధులు ఉన్నప్పటికీ నిర్వాసితుల సంరక్షణ, భద్రతను మేయర్ గాలికొదిలేశారని.. వెరీ షేమ్ ఫుల్.. అని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు న్యూయార్క్ లో నగరంలోని తీవ్రమైన పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఆకస్మిక వరదల వల్ల న్యూయార్క్ లో సంభవించిన వినాశనాన్ని ఈ వీడియోలు చూపిస్తున్నాయి. వరద తాకిడి, ప్రమాదం ఎంత ఉందో చెబుతున్నాయి. మునిగిపోయిన కార్లు, గ్రిడ్ లాక్ చేయబడిన ట్రాఫిక్, నీళ్లలో మునిగిన రహదారులకు సంబంధించి వీడియోలను షేర్ చేశారు స్థానికులు.

గత రాత్రి కుండ పోత వర్షం కురిసింది. గడిచిన రెండు సంవత్సరాల్లో ఇది అత్యధికం.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సిటీ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మరోచోట ఆశ్రయం పొందాలని హెచ్చరికలు జారీ చేశారు.

రానున్న 24 గంటలు కష్టతరంగా ఉండొచ్చని జాతీయ వాతావరణ శాఖ పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి. భారీ వర్షాల కారణంగా మెట్రో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయని, దీంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని వాతావరణ నిపుణుడు డొమినిక్ రామున్ని చెబుతున్నారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..