ప్రపంచ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కొందరు ఓ వైపు తమ సాంప్రదాయాన్ని అనుసరిస్తూనే.. మరోవైపు పార్టీలుతో న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి అందమైన, సుందరమైన ప్రదేశాలను సందర్శించారు. చాలా మంది డైనింగ్ కోసం బయటకు వెళ్లి.. రక రకాల ఫుడ్స్ ను టేస్ట్ చేసి.. హ్యాపీగా ఎంజాయ్ చేశారు. న్యూ ఇయర్ ఈవ్ లో డ్యాన్స్, మందు, విందు ఇలా ఎన్ని ఉన్నా.. ఫుడ్ ఖచ్చితంగా హైలైట్ అయ్యే అంశం.. ఈ నేపథ్యంలో దుబాయ్‌లోని రెస్టారెంట్ ఓ రెస్టారెంట్ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది 6,20,926.61 దిర్హామ్.. అంటే మన దేశ కరెన్సి లో సుమారు 1,39,67,807 రూపాయలు.
దుబాయ్‌లోని డౌన్‌టౌన్‌లోని ఒక GAL రెస్టారెంట్ కు సంబంధించింది ఈ బిల్లు. న్యూ ఇయర్ సందర్భంగా 18 మంది అతిథులు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారని.. వారు అందరూ కలిసి ఈ భారీ బిల్లును సమర్పించినట్లు రెస్టారెంట్ యజమాని మెర్క్ తుర్క్‌మెన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆ బిల్లుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని షేర్ చేసి.. తుర్క్‌మెన్ ఇది “మొదటిది కాదు, చివరిది కాదు” అని క్యాప్షన్ ఇచ్చారు.. తన రెస్టారెంట్‌ను ట్యాగ్ చేశారు.
యాపిల్ జ్యూస్, లాట్, గ్రీన్ టీ, కోకా-కోలా వంటి డ్రింక్స్ సహా అనేక రకాల పానీయాలు, కాక్‌టెయిల్‌లు తాగినట్లు ఈ భారీ బిల్లు ద్వారా తెలుస్తోంది. డిసెంబర్ 31న డౌన్‌టౌన్ ప్రాంతంలోని ప్రజలు .. చివరి నిమిషంలో రెస్టారెంట్ బుకింగ్‌లు చేసుకున్నారు.. దీంతో వారి బుకింగ్‌లకే ఎక్కువ ఖర్చు అయింది.
GAL రెస్టారెంట్ దుబాయ్ అనేది సమకాలీన మెడిటరేనియన్-టర్కిష్ వంటకాల రెస్టారెంట్. ఇది బుర్జ్ ఖలీఫాను చూసే అవకాశం కూడా అందిస్తుంది. ఇది QFoodBeverage గ్రూప్ కు చెందింది. మెర్క్ తుర్క్‌మెన్ రైన్ అనే ప్రైవేట్ సిగార్ లాంజ్‌ని కూడా కలిగి ఉంది.
అదే విధంగా, అబుదాబిలోని నస్ర్-ఎట్ స్టీక్‌హౌస్ లో కూడా 615,065 దిర్హామ్( Dhs) భారీ బిల్లు వెలుగు చూసింది. నస్రెట్ గోక్సే రెస్టారెంట్ యజమాని .. చెఫ్ ఈ బిల్లుకి సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ UAE ప్రజలు ఎంతో ఇష్టపడి పార్టీలు చేసుకున్నారు.. విందు వినోదం కోసం భారీగా ఖర్చు పెట్టారు కూడా..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..