బుడ్డొడ్డు బుడ్డొడ్డు..అన్నారంటే..అనేది యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలోని డైలాగ్..కానీ, ఇక్కడ ఓ బుడ్డొడ్డు ఏకంగా గిన్నీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు.. ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని చూశారా.. ఇతని పేరు ‘డోర్ బహదూర్ ఖపంగి’, సరిగ్గా గిన్నిస్ బుక్ రికార్డు అంత సైజు కూడా లేడు, కానీ గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నాడు. మరి ఇంతకీ ఏం సాధించాడనేదే కదా మీ అనుమానం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తి తాజాగా గిన్నిస్ బుక్ నేపాల్‌కు చెందిన డోర్ బహదూర్ ఖపంగిను ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఇతని ఎత్తు ఎంతో తెలుసా..? డోర్ బహదూర్ ఎత్తు కేవలం 73 సెంటీమీటర్లు మాత్రమే. నేపాల్‌లోని ఖాట్మండులో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి తన అవార్డును స్వీకరించడానికి తన బంధువుతో కలిసి వచ్చాడు డోర్ బహదూర్ ఖపంగి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టూరిజం బోర్డు సీఈఓ ధనంజయ్ రెగ్మీ, ఖపాంగికి ఫ్రేమ్డ్ సర్టిఫికేట్‌ను అందజేశారు. అది అతని ఛాతి వరకు వచ్చింది.
ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ పేరిట ఉంది. ఈయన ఎత్తు 2 అడుగుల 4.9 అంగుళాలు..మాత్రమే. ఇకపోతే, తాజాగా, ప్రపంచంలోనే మగవాళ్లలో పొట్టి టీనేజర్‌గా నేపాల్‌కు చెందిన డోర్ బహదూర్ ఖపంగి గిన్నిస్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల బహదూర్ కేవలం 73 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉన్నారు. ఇంతకుముందు ఈ రికార్డు 67 సెంటీమీటర్ల ఎత్తుండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020లో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు కేవలం 62 సెంటీమీటర్లు.