‘భారత్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను..’ ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని బాలెన్ లేఖ!

నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్ షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. ప్రధాని మోదీ పోస్ట్‌కు నేపాల్ ప్రధాని బాలెన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నామని నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

భారత్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను.. ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని బాలెన్ లేఖ!
Nepal New Pm Balen Shah Thanks To Pm Modi

Updated on: Mar 28, 2026 | 12:19 PM

నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్ షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. ప్రధాని మోదీ పోస్ట్‌కు నేపాల్ ప్రధాని బాలెన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నామని నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

శనివారం (మార్చి 28) చేసిన ఒక పోస్ట్‌లో “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మీ దయగల మాటలకు, హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మన ప్రజల ఉమ్మడి శ్రేయస్సు కోసం మన రెండు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను.” అని బాలెన్ పేర్కొన్నారు.

ఇదిలావుంటే, శుక్రవారం (మార్చి 27, 2026) నేపాల్ ప్రధానమంత్రిగా బలేంద్ర బలేన్ షా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత్-నేపాల్ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కలిసి పనిచేయడానికి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సమాధానం వచ్చింది. ప్రధాని మోదీ సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్‌లో ఈ వ్యాఖ్యలు చేస్తూ, బలేన్ షా నియామకం, అతని నాయకత్వంపై నేపాల్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, కలిసి పనిచేయడం వల్ల ప్రజల గొప్ప ప్రయోజనం కోసం న్యూఢిల్లీ – ఖాఠ్మండు మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. “నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షా హృదయపూర్వక అభినందనలు. మీ నియామకం, మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు ఉంచిన నమ్మకానికి నిదర్శనం. మన రెండు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనం కోసం భారత్-నేపాల్ స్నేహాన్ని, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను,” అని ప్రధాని మోదీ అన్నారు.

బాలెన్ షా శుక్రవారం నేపాల్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి కార్యాలయంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బాలేంద్ర షా నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం షాను నియమించిన అనంతరం, నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రామ్ సహాయ ప్రసాద్ యాదవ్, ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ మాన్ సింగ్ రౌత్, జాతీయ అసెంబ్లీ ఛైర్మన్ నారాయణ్ ప్రసాద్ దహల్, మాజీ ప్రధాన మంత్రులు, ఉన్నతాధికారులు, భద్రతా అధిపతులు, దౌత్య వర్గాల సభ్యులు హాజరయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us