ఆకాశంలో మిస్టీరియస్ ‘బ్లాక్ రింగ్’..ఎక్కడ ? ఏమై ఉంటుందో ?

| Edited By: Anil kumar poka

Jan 23, 2020 | 12:56 PM

పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఇటీవల  నింగిని చూసినవారికి అద్భుతమైన, విచిత్రమైన దృశ్యం కనబడి నోళ్లు వెళ్ళబెట్టారు.  నల్లని పొగతో వలయాకారంతో.. గుండ్రంగా తిరుగుతున్నట్టు ఓ రింగ్ వంటిది చూసి వారి ఆశ్ఛర్యానికి అంతు లేకపోయింది. ఇది ఏమై ఉంటుందని, స్థానికులు, సోషల్ మీడియా యూజర్లు తెగ డైలమాలో పడిపోయారు. ఇది బహుశా ఏలియన్ షిప్ అయి ఉంటుందని కొందరు, మనకు తెలియని రహస్యాలు  ఆకాశంలో యేవో జరుగుతున్నాయని మరికొందరు తర్కించుకున్నారు.ఇది  మరో ‘ ప్రదేశం ‘ […]

ఆకాశంలో  మిస్టీరియస్ బ్లాక్ రింగ్..ఎక్కడ ? ఏమై ఉంటుందో ?
Follow us on

పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఇటీవల  నింగిని చూసినవారికి అద్భుతమైన, విచిత్రమైన దృశ్యం కనబడి నోళ్లు వెళ్ళబెట్టారు.  నల్లని పొగతో వలయాకారంతో.. గుండ్రంగా తిరుగుతున్నట్టు ఓ రింగ్ వంటిది చూసి వారి ఆశ్ఛర్యానికి అంతు లేకపోయింది. ఇది ఏమై ఉంటుందని, స్థానికులు, సోషల్ మీడియా యూజర్లు తెగ డైలమాలో పడిపోయారు. ఇది బహుశా ఏలియన్ షిప్ అయి ఉంటుందని కొందరు, మనకు తెలియని రహస్యాలు  ఆకాశంలో యేవో జరుగుతున్నాయని మరికొందరు తర్కించుకున్నారు.ఇది  మరో ‘ ప్రదేశం ‘ నుంచి వచ్చిన ‘ పోర్టల్’ అయి ఉండవచ్ఛునని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు.

ట్విట్టర్లో ఈ వీడియోను 37 వేల మంది చూశారట. బ్లాక్ రింగ్ కనబడిందంటే ఔటర్ వరల్డ్ లో ఇంకా ఎవరో ఉండి ఉండవచ్ఛునని  ట్విటర్ యూజర్లు పేర్కొన్నారు. ఇలా ఎవరికి  వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచంలో నింగిన ఇలాంటి దృశ్యాలు మరికొన్ని కనిపించాయని అంటూ ఆ వీడియోలను పోస్ట్ చేశారు కొంతమంది. ఈ నెల 21 న దుబాయ్ లోనూ ఇలాంటిదే కనబడిందని ఒకరు ఆ వీడియోను రిలీజ్ చేశారు. అయితే భూమిపై పారిశ్రామిక పదార్థాలు ఏవైనా పేలిపోయినప్పుడు దాని ప్రభావం వల్ల ఆకాశంలో ఈ విధమైన రింగులు ఏర్పడడం సహజమేనని ఒక అధ్యయనం పేర్కొంది.. 2012 లో షికాగోలో కూడా ఈ విధమైన దృశ్యమే కనబడిందట. ఓ ఎలెక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్ పేలిపోయిన కారణంగా బహుశా నల్లని రింగ్ ఏర్పడిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.