మయన్మార్‌‌లో కొనసాగుతున్న సైన్యం క్రూరత్వం.. పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు.. ఖండించిన అంతర్జాతీయ సమాజం

|

Apr 02, 2021 | 8:07 PM

రెండు నెలల క్రితం మొదలై మయన్మార్‌ రాజకీయ అనిశ్చితి ప్రకంనలు సృష్టిస్తోంది. మిలటరీ సర్కార్‌కు వ్యతిరేకంగా మొదలైన సైనిక తిరుగుబాటు.. తీవ్ర రక్తపాతానికి దారి తీస్తోంది.

మయన్మార్‌‌లో కొనసాగుతున్న సైన్యం క్రూరత్వం.. పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు.. ఖండించిన అంతర్జాతీయ సమాజం
Myanmar Military Slammed For Deaths Of Over Children
Follow us on

Myanmar military’s ruthless suppression: రెండు నెలల క్రితం మొదలై మయన్మార్‌ రాజకీయ అనిశ్చితి ప్రకంనలు సృష్టిస్తోంది. మిలటరీ సర్కార్‌కు వ్యతిరేకంగా మొదలైన సైనిక తిరుగుబాటు.. తీవ్ర రక్తపాతానికి దారి తీస్తోంది. ప్రజాస్వామ్యం కోరుకుంటున్న ఆందోళనకారులపై సైన్యం కర్కశంగా ప్రవర్తిస్తూ.. కనిపించినవారినల్లా కాల్చి చంపేస్తోంది. ఇప్పటివరకూ జరిగిన పలు ఘటనల్లో 40 మందికి పైగా చిన్నారులు సైతం ప్రాణాలను కోల్పోయారు. వీరితో పాటు వందల సంఖ్యలో ప్రజలు కనిపించకుండా పోయారు. దీంతో మయన్మార్ మిలిటరీ వికృత చర్యలపట్ల అంతర్జాతీయ సమాజం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ప్రజాస్వామ్య అనుకూల నిరసనలపై మయన్మార్ సైన్యం అణిచివేస్తోంది. స్థానిక పర్యవేక్షణ సంస్థ అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ఖైదీలు (ఏఏపీపీ) లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు 44 మంది చిన్నారులతో సహా 543 మంది పౌరులు మరణించారని వెల్లడించారు. సైన్యం సుమారు 2,700 మందిని బలవంతంగా అదుపులోకి తీసుకుందని తెలిపింది. కొద్ది వారాలుగా హింస మరింత తీవ్రమైందని, గత 12 రోజుల్లో చిన్నారుల మరణాలు రెట్టింపయ్యాయని సేవ్‌ ది చిల్డ్రన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘చిన్నారులను ఈ దాడుల నుంచి రక్షించమని పదేపదే చెబుతున్నప్పటికీ..ఈ ప్రాణాంతక దాడుల్లో వారే సమిధలవుతుండటం తీవ్రంగా బాధిస్తోంది. వీరిలో చాలా మంది ఇళ్లల్లోనే ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణం’ అని స్వచ్ఛంద సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పిల్లల పట్ల మయన్మార్ సైన్యం క్రూరత్వాన్ని కళ్లకుగట్టిందిన పేర్కొంది.

అలాగే, ప్రజాస్వామ్య అనుకూల నిరసనలకు మద్దతు ఇస్తున్నారనే అనుమానం ఉన్న వ్యక్తుల ఇళ్లపై సైన్యం రాత్రుళ్లు దాడులు జరుపుతోందని, వారిని బలవంతంగా కనిపించకుండా చేస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. కనిపించకుండాపోయినవారు ఎక్కడున్నారో చెప్పేందుకు, న్యాయ సహాయం అందించేందుకు సైన్యం నిరాకరిస్తోందని వెల్లడించింది. ‘ఏకపక్ష అరెస్టులు, బలవంతపు అదృశ్యాలు.. సైన్యం తిరుగుబాటును వ్యతిరేకించే వారిలో భయాన్ని నింపేందుకే’ అని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆసియా డైరెక్టర్ బ్రాడ్ ఆడమ్స్ వ్యాఖ్యానించారు. ఆ సైనిక నేతల లక్ష్యంగా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆడమ్స్ అభ్యర్థించారు.

శాంతియుత నిరసనకారులపై మయన్మార్ సైన్యం క్రూరంగా వ్యవహరించడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వేగంగా క్షీణిస్తోన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సైన్యం చర్యలను ఖండించింది. సైన్యంలోని కీలక వ్యక్తుల వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా బ్రిటన్ మరోదఫా ఆంక్షలు విధించింది. అయితే, ఈ చర్యలేవీ సైన్యంపై పని చేస్తున్నట్లు కనిపించడం లేదు.

ఇదిలావుంటే.. స్థానిక మీడియా కథనం ప్రకారం ..శుక్రవారం కూడా ప్రజలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరణించినవారికి గుర్తుగా యాంగూన్‌లోని బస్‌స్టాపులు, ఇతర ప్రదేశాల్లో ప్రజలు పూలు వదిలివెళ్తున్నారు. మరోవైపు, ఆందోళనలనను అణచివేసేందుకు మయన్మార్ సైన్యం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. నిరసనలను ఎక్కడికక్కడే కట్టడి చేసేందుకు కమ్యూనికేషన్ సేవలను మూసివేసేలా ఆదేశాలు ఇచ్చింది.

రహస్య చట్టాలను ఉల్లఘించారనే ఆరోపణలతో బహిష్కరించబడిన పౌర నేత ఆంగ్‌ సాన్‌ సూకీపై సైన్యం మరో క్రిమినల్ నేరాన్ని మోపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరిచి, విచారణ జరుపుతోంది. మయన్మార్ ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటంలో మరో ప్రముఖ వ్యక్తి మై అయేపై గురువారం నేరపూరిత నేరాలకు పాల్పడటానికి వ్యతిరేకంగా అభియోగాలు మోపినట్లు సమాచారం.

Read Also….  గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులకు పన్ను మినహాయింపు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్