Video: భారీ భూకంపం.. మెట్రో రైలు చూడండి ఎలా ఊగిపోయిందో! వణుకు పుట్టించే దృశ్యాలు

మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం 20 మంది ప్రాణాలను బలిగొంది. నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి, థాయిలాండ్ సరిహద్దులోని ఒక మఠం ధ్వంసం అయ్యాయి. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. అనేక భవనాలు కూలిపోయాయి, మెట్రో సేవలు నిలిపివేశారు. థాయ్ ప్రధానమంత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Video: భారీ భూకంపం.. మెట్రో రైలు చూడండి ఎలా ఊగిపోయిందో! వణుకు పుట్టించే దృశ్యాలు
Thailand Metro Earthquake

Updated on: Mar 28, 2025 | 5:08 PM

మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. దేశ రాజధానికి 260 కి.మీ దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి సమీపంలో 7.7 తీవ్రతతో సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా 20 మంది మరణించినట్లు సమాచారం. మయన్మార్ రాజధాని నేపిడాలో నిర్మాణంలో ఉన్న 1,000 పడకల ఆసుపత్రి నేలమట్టమైంది. అలాగే థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఒక మఠం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఉత్తర థాయిలాండ్ వరకు ఈ భూకంప ప్రకంపనలు వ్యాపించాయి. బ్యాంకాక్‌లో కొన్ని మెట్రో సేవలు నిలిపివేశారు.

అయితే మెట్రో స్టేషన్‌లో నిలిచి ఉన్న ఓ మెట్రో రైలు.. భూకంపం కారణంగా అటు ఇటూ కదులు కనిపించిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది. థాయ్ ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రా నగరంలో ‘అత్యవసర పరిస్థితిని’ ప్రకటించారు. అలాగే, బ్యాంకాక్‌లోని చతుచక్‌లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. దీంతో తీవ్ర ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.