Myanmar Earthquake: మృత్యు విలయం.. 694 మంది మృతి! మయన్మార్‌కు భారత్ భారీ సాయం!

మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల భారీ నష్టం సంభవించింది. 694 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం 15 టన్నుల సహాయ సామగ్రిని పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Myanmar Earthquake: మృత్యు విలయం.. 694 మంది మృతి! మయన్మార్‌కు భారత్ భారీ సాయం!
Myanmar Earthquake

Updated on: Mar 29, 2025 | 10:46 AM

ఓవైపు శిథిలాల కింద శవాల దిబ్బలు.. మరోవైపు కాపాడండి అనే ఆర్తనాదాలతో మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో ఎటూ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆగ్నేసియా దేశాలను భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. ఆరు భూకంపాలు ఆయా దేశాలను అతలాకుతలం చేశాయి. 7.7 మ్యాగ్నిట్యూడ్స్‌ పాయింట్స్‌తో వచ్చిన భూకంపంతో మయన్మార్‌, థాయ్‌లాండ్‌ విలవిల్లాడుతున్నాయి. భారీ భవనాలు నేలమట్టం కావడంతో ఎక్కడ చూసినా శిథిలాలు, శవాల దిబ్బలు దర్శనమిస్తుండడం మనసులను కలచివేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మయన్మార్‌కు భారత్‌ ఆపన్న హస్తం అందించింది.

భారత్ నుంచి భారీ సాయం..

ఢిల్లీ నుంచి 15 టన్నుల రిలీఫ్ మెటిరియల్‌ మయన్మార్‌కు పంపించింది భారత ప్రభుత్వం. ఇండియా నుంచి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం, వాటర్ ప్యూరిఫైయర్స్‌, హై జీన్ కిట్లు, సోలార్ ల్యాంప్స్‌, జనరేటర్ సెట్లు ఇతర వస్తువులతో సహా కీలకమైన రోజువారీ అవసరాలతో కూడిన సహాయ సామగ్రితో AFS హిండన్ నుండి IAF C 130 J విమానం బయలుదేరి వెళ్లినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

694 మంది మృతి..

మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 694 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది. వరుస భూకంపాల తీవ్రతకు మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. శిథిలాల కింద వేల మంది చిక్కుకోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతదేహాలను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్‌లోని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి, మాండలే నగరంలో ఐకానిక్‌ వంతెన, ఎత్తైన ఆలయాలు, గోపురాలు భూకంప తీవ్రతకు కుప్పకూలాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.