Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మెుదటి స్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ సంచలనాలకు పెట్టింది పేరు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఊహించటం చాలా కష్టం. ఎవరి ఊహలకూ అందని ఆలోచనలు, వ్యాపార ప్రణాళికలు ఆయనకే సాటి. ట్విట్టర్ కొనుగోలు విషయంలో గెలిచిన తరువాత.. కోకాకోలా, మెక్‌డొనాల్డ్ వంటి దిగ్గజ కంపెనీలను కొంటానంటూ ట్విట్ల షాక్స్ ఇచ్చారు మస్క్. ఈ తరుణంలోనే తాజాగా భారతదేశానికి చెందిన దిగ్గజ టీకా తయారీ సంస్థ సీరమ్ సీఈవో కూడా ఎలాన్ మస్క్ ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ.. పెట్టుబడులకు భారత్ చాలా అనువైనదేశమని అన్నారు. మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో.. తాను అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే.. అంటూ మరో సంచలన ట్వీట్ చేశారు.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
— Elon Musk (@elonmusk) May 9, 2022
” నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం” అంటూ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అనటం ఇప్పుడు ప్రపంచంలో అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ పోస్టుకు ఒక గంట ముందు.. ‘ఉక్రెయిన్‌లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది.’ అంటూ రష్యన్ అధికారి పంపిన సందేశాన్ని కూడా ఎలాన్ మస్క్ షేర్ చేశారు. ఉక్రెయిన్‌కు పెంటగాన్ సాయం వెనుక మస్క్ సహకారం కూడా ఉందంటూ రష్యన్ స్పేస్ చీఫ్ రొగొజిన్ అన్నారు. ఉక్రెయిన్ మిలిటరీ సేనలకు స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు అందించటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ తరుణంలో రష్యా అధికారి చేసిన ట్వీట్ కు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చారా.. మస్క్‌కు రష్యా నుంచి బెదిరింపులు మెుదలయ్యాయా అనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Stock Market: మార్కెట్లను కుదేలు చేస్తున్న వడ్డీ రేట్ల పెంపు.. వారం ప్రారంభంలోను మారని తీరు..
Atta Price: రికార్డులు కొల్లగొడుతున్న గోధుమ పిండి ధర.. 12 ఏళ్ల తర్వాత భారీగా పెరుగుతున్న రేట్లు..