
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వరుస పేలుళ్లుతో దద్దరిలింది.సిటీలోని మూడు హోటల్స్, మూడు చర్చిలు వద్ద జరిగిన పేలుళ్లులో 160 మందికి పైగా మరణించించగా.. సుమారు 350 మంది గాయపడ్డారు. కొచ్చికోడ్ ప్రాంతంలోని ప్రముఖ సెయింట్ ఆంటోని చర్చితో పాటు కటువాపిటియాలోని మరో చర్చిలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇదే సమయంలో శాంగ్రిలా, కింగ్స్‌బరి హోటళ్లలో కూడా పేలుళ్లు జరిగాయి. ఈస్టర్ పండుగ రోజున చర్చిలు, హోటల్స్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. క్షతగాత్రులను కొలంబోలోని నేషనల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని శ్రీలంక మీడియా ధృవీకరించింది. కాగా పేలుడులో భారతీయులు ఎవరైనా ఉన్నారా.? అనే దానిపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఆరా తీస్తున్నారు.
#UPDATE Srilankan media: More than 25 people reported dead & more than 200 injured following several explosions in Colombo pic.twitter.com/qm3vkjT5Ah
— ANI (@ANI) April 21, 2019