Lahore Blast: పాకిస్తాన్‌లో బాంబుల భయం.. లాహోర్‌ను వణికించిన వరుస పేలుళ్లు.. ఎయిర్‌పోర్టులు మూసివేత

ఆపరేషన్‌ సింధూర్‌తో వణికిపోతున్న పాకిస్థాన్‌లో మరో బిగ్ బ్లాస్ట్‌ బెంబేలెత్తించింది. వరుస బాంబుల శబ్ధాలతో పాక్‌ ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా.. వరుస బాంబు పేలుళ్లు పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో అతిపెద్ద నగరమైన లాహోర్‌లోని వాల్టన్ రోడ్‌లో గురువారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది.

Lahore Blast: పాకిస్తాన్‌లో బాంబుల భయం.. లాహోర్‌ను వణికించిన వరుస పేలుళ్లు.. ఎయిర్‌పోర్టులు మూసివేత
Lahore Blast

Updated on: May 08, 2025 | 9:59 AM

ఆపరేషన్‌ సింధూర్‌తో వణికిపోతున్న పాకిస్థాన్‌లో మరో బిగ్ బ్లాస్ట్‌ బెంబేలెత్తించింది. వరుసగా బాంబుల శబ్ధాలతో పాక్‌ ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా.. వరుస బాంబు పేలుళ్లు పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లో అతిపెద్ద నగరమైన లాహోర్‌లోని వాల్టన్ రోడ్‌లో గురువారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. లాహోర్‌ లో వరుస పేలుళ్లు సంభవించినట్లు పాకిస్తాన్‌ అధికారులు సైతం ధృవీకరించారు. దీంతో హై అలర్ట్ జారీ చేశారు. లాహోర్, కరాచీ‌ ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు.

పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాకిస్థాన్ లో బాంబు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది.. గురువారం ఉదయం బాంబుల శబ్ధాలతో వణికిపోయినట్లు లాహార్‌లోని ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

బీఎల్ఏ కూడా పాకిస్తాన్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే.. పాక్ సైన్యంపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు రేంజర్లు కూడా మరణించారు.

ఇదిలాఉంటే నిన్న పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన తర్వాత ఉద్రిక్తలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్థాన్ పై వైమానిక దాడి చేసిన క్రమంలో ఇలాంటి ఘటన జరగడం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు అయ్యింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..