వేసవిలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తినే పుచ్చకాయ సాధారణంగా కిలో రూ.20 నుంచి 50,70 వరకు పలుకుతుంది. అయితే లక్ష రూపాయల విలువైన పుచ్చకాయ ఉందంటే మీరు నమ్మగలరా..? అవును.. మీరు వింటున్నది నిజమే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ రకం ఒకటి ఉంది. ఈ పుచ్చకాయ అరుదైన జాతి కావడంతో దీని విలువ లక్షల రూపాయలు పలుకుతోంది.. డెన్సుకే బ్లాక్ పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా అమ్ముడవుతోంది. దీనిని నల్ల పుచ్చకాయ అని కూడా అంటారు. అత్యంత ఖరీదైన, అరుదైన పుచ్చకాయ ఎక్కడ దొరుకుతుంది. దాని ధర ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ జపాన్‌లో ఉంది. చాలా అరుదైన ఈ పుచ్చకాయ జపాన్‌లోని హక్కైడో ద్వీపం ఉత్తర భాగంలో కనిపిస్తుంది. అన్ని ప్రదేశాలలో అందుబాటులో ఉండదు. ఈ పుచ్చకాయ జాతి చాలా అరుదు. ఈ జాతికి చెందిన పుచ్చకాయలు ఏడాదికి100 మాత్రమే సాగు చేస్తారు. ఈ కారణంగానే ఇది ధర అత్యంత ఖరీదు.
సాధారణంగా మార్కెట్‌లో కిలో పుచ్చకాయ ధర రూ. 20-30 నుంచి 50-70 రూపాయల వరకు ఉంటుంది. కానీ డెన్సుకే బ్లాక్ వాటర్ మిలన్ మాత్రం సాధారణ మార్కెట్‌లో విక్రయించబడదు. ఈ పుచ్చకాయ ప్రతి సంవత్సరం వేలం వేయబడుతుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు భారీగా వేలం వేశారు. 2019 సంవత్సరంలో ఈ అరుదైన పుచ్చకాయ అత్యధికంగా రూ. 4 లక్షల బిడ్ వచ్చింది. కోవిడ్ మహమ్మారి సమయంలో దీని ధర బాగా తగ్గింది. కానీ, నేటికీ ఈ రకం పుచ్చకాయ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా అమ్ముడవుతోంది.
లక్షల రూపాయలకు కొని అమ్ముకుంటున్న ఈ పుచ్చకాయ ప్రత్యేకత ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే దీని వెనుక కారణం ఏంటో తెలుసుకోండి. ఈ పుచ్చకాయ చాలా మెరుస్తూ నలుపు రంగులో ఉంటుంది. ఇది మామూలు పుచ్చకాయల అస్సలు కనిపించదు. ఈ పండు లోపల గుజ్జు కరకరలాడుతూ ఉంటుంది. ఇది చాలా తియ్యగా ఉండి,..సాధారణ పుచ్చకాయ కంటే తక్కువ విత్తనాలు కలిగి ఉంటుంది. అందిన సమాచారం ప్రకారం ఈ పుచ్చకాయ మొదటి పండు మాత్రమే ఇంత ఖరీదు. తర్వాతి పంట 19 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తుందని తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..