నైజీరియాలో అమానుషం.. పొలంలో పనులు చేసుకుంటున్న 43 మంది రైతుల గొంతు కోసి చంపిన మిలిటెంట్లు..

|

Nov 29, 2020 | 10:06 PM

నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. పొలంలో పనులకు వెళ్లిన 43 మంది రైతులను మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు.

నైజీరియాలో అమానుషం.. పొలంలో పనులు చేసుకుంటున్న 43 మంది రైతుల గొంతు కోసి చంపిన మిలిటెంట్లు..
Follow us on

నైజీరియాలో దారుణం చోటు చేసుకుంది. పొలంలో పనులకు వెళ్లిన 43 మంది రైతులను మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఇంకా కొంత మంది రైతుల ఆచూకీ తెలియడం లేదు. ఈశాన్య నైజీరియాలోని మైదుగురి ప్రాంతంలో ఈ దుర్మార్గం చోటు చేసుకుంది. ఈ ఘటనతో యావత్ నైజీరియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అమానుష ఘనటగా అభివర్ణించారు. చనిపోయిన వారందరికీ నైజీరియా ప్రభుత్వం సామూహిక అంత్యక్రియలు నిర్వహించింది. కాగా, ఈ దురాగతానికి పాల్పడింది బొకొ హరమ్ మిలిటెంట్లేనని అనుమానిస్తున్నారు.