
మెక్సికోలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక గూడ్స్ రైలు డబుల్ డెక్కర్ ప్యాసింజర్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, సుమారు 60 మంది గాయపడ్డారు. మెక్సికో సిటీ నుండి 115 కి.మీ దూరంలో ఉన్న అట్లాకోముల్కోలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న గూడ్స్ రైలు రైల్వే క్రాసింగ్ వద్ద ప్రయాణికులతో నిండిన బస్సును ఢీకొట్టింది. బస్సు, వేగంగా వస్తున్న రైలు ముందు నుండి వెళ్ళడానికి ప్రయత్నిచిందని లోకో పైలట్ తెలిపాడు.. ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యం సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఫుటేజ్‌లో బస్సు మారవతియో-అట్లాకోముల్కో హైవేపై ట్రాఫిక్ లో నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా వాహనాలు ఆగిపోయాయి. అందులో ఈ బస్సు లైన్ ముందు ఉంది. అకస్మాత్తుగా బస్సు ముందుకు కదులుతుంది. రైలు దాటే ముందు డ్రైవర్ అవతలి వైపుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బస్సు ట్రాక్ మధ్యలోకి చేరుకోగానే రైలు వచ్చి నేరుగా కోచ్‌ను ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా బస్సు మొత్తం మలుపు తిరిగింది. రైలుతో పాటు చాలా దూరం ఈడ్చుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే అత్యవసర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. సంఘటనా స్థలం నుండి అందిన చిత్రాలలో, బస్సు పై డెక్‌లో ఒక భాగం పూర్తిగా కనిపించకుండా పోయింది.
అనేక ప్రాంతాల నుండి అంబులెన్స్ బృందాలు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల నుండి ప్రాణాలతో బయటపడిన వారిని బయటకు తీయడం ప్రారంభించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు మరణించారని మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండగా, మరికొందరు వెంటనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిసింది.
MEXICO CITY (AP) — A train slammed into a double-deck bus northwest of Mexico City early Monday, killing at least eight people and injuring 45, authorities said. pic.twitter.com/uJ0sJRLqRq
— AZ Intel (@AZ_Intel_) September 8, 2025
మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్న ఒక పారిశ్రామిక జోన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రైలు వస్తున్నట్లు ట్రాఫిక్‌ను అప్రమత్తం చేయడానికి క్రాసింగ్ గేట్లు లేదా హెచ్చరిక సిగ్నల్స్ లేవు. రైలు ఆపరేటర్ అయిన కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ ఆఫ్ మెక్సికో, సంతాపం వ్యక్తం చేస్తూ అధికారులతో సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..