దుబాయ్‌లో ఒక అందమైన ఇల్లు అమ్మకానికి వచ్చింది. ఆ ఇంటి ధర అత్యంత ఖరీదు పలుకుతోంది. రూ. 1,675 కోట్లకు ఆ ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇంత ఖరీదైన ఆ ఇల్లు ఎలా ఉంటుంది. దాని ప్రత్యేకతలు ఏంటీ..? ఈ ఇల్లు ఎలాంటి సదుపాయాలను కలిగి ఉంటుందనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ వస్తుంది. అయితే మీకా సందేహమే వద్దు. ఎందుకంటే అది ఇల్లు కాదు.. ఇంద్రభవనమనే చెప్పాలి. దుబాయ్ లో మార్బుల్ ప్యాలెస్ అని పిలవబడే ఈ ఇల్లు ఇటాలియన్ రాళ్లతో, దాదాపు 7,00,000 బంగారు రేకులను ఉపయోగించి అలంకరించారు. ఇందులో 5 బెడ్‌రూమ్‌లు, 19 బాత్‌రూమ్‌లు, 15 కార్ గ్యారేజ్, ఇండోర్, అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్, 70,00,000 లీటర్ల సామర్థ్యం గల కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి.
ఈ పాలరాతి ప్యాలెస్ నిర్మించడానికి సుమారు 12 సంవత్సరాలు పట్టింది. 2018 నాటికి ఇది పూర్తయింది. ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది. దాని యజమాని, స్థానిక ప్రాపర్టీ డెవలపర్. అతని పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. Lukshabitatsorbi వద్ద బ్రోకర్ అయిన కునాల్ సింగ్ మాట్లాడుతూ, ‘ఇది అందరికీ నచ్చే విధంగా, జీవన శైలిలో నిర్మించిన ఇల్లు కాదు. కొనుగోలుదారులు దీన్ని ఇష్టపడతారని లేదా ద్వేషిస్తారన్నది కూడా మాకు తెలుసు. ప్రపంచం మొత్తం మీద ఐదు నుంచి పది మందికి మాత్రమే కొనుగోలు చేసే సామర్థ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఎమిరేట్స్ హిల్స్ అనేది 20 సంవత్సరాల క్రితం రూపొందించబడిన గేటెడ్ కమ్యూనిటీ. దీనిని దుబాయ్‌లోని బెవర్లీ హిల్స్ అని కూడా అంటారు. ఇది గోల్ఫ్ కోర్సుకు ఆనుకుని ఉంటుంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి