Viral News: బంధాలు బాధ్యతలు.. ఆ మహిళకు తాను చేస్తున్న పని బరువు అనిపించలేదు. మగవారికి ఎందులోనూ ఆడవారు తక్కువ కాదని నిరూపిస్తోంది ఓ మహిళ. మలేషియా(Malaysia) వితంతువు ఏకంగా నాలుగు సిలిండర్ల (cylinders) ను నెడుతున్న చిత్రాలు ఇటీవల సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మహిళ వృత్తి నైపుణ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.
మలేషియాకు చెందిన ఖైరూనీసా అనే 30 ఏళ్ల మహిళ గ్యాస్ సిలిండర్ సప్లయర్‌గా వర్క్ చేస్తోంది. సాధారణంగా ఈ వృత్తిలోకి పురుషులే వస్తుంటారు మహిళలు రావడం చాలా అరుదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మహిళ సప్లయర్‌గా చేరి.. అసాధారణ రీతిలో ఒకేసారి నాలుగు సిలిండర్లను మోస్తూ మలేషియాలోనే కాదు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
ఖైరు భర్త ట్రక్ డ్రైవర్. ఇటీవల తన భర్త మరణించడంతో కుటుంబ పోషణ తన మీద పడింది. అత్తగారి భాద్యత మీద పడడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో సిలెండర్ సరఫరా చేసే ఉద్యోగంలో చేరింది. మొదట్లో, ఖైరు పని ప్రారంభించినప్పుడు, ఆమెను ఎగతాళి చేశారు. అయితే తాను ఎవరినీ లెక్కచేయకుండా పనిచేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఖైరూ నీసా ఒక్క రోజులో కనీసం 60 నుంచి 100 వరకు గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తుంది. అత్యవసర సమయంలో అయితే ఒకేసారి 7 గ్యాస్ సిలిండర్ల వరకు మోస్తుందట. కుటుంబ పోషణ కోసం ఇంత కష్టపడుతున్న ఆ మహిళ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. తనను చూసి నెటిజన్లు సూపర్ మేడమ్.. మహిళలు దేంట్లోనూ పురుషుల కన్నా తక్కువ కాదని నిరూపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఖైరు కథ.. చాలా మంది ముందుకు వచ్చారు. ఆమెకు సహాయం చేయడానికి సిద్ధమయ్యారు.
Also Read: