విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చిక్కుకుపోయిన భారతీయులు..40 గంటలుగా ఎదురుచూపులు..

అక్కడి మారుమూల విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 200 మంది భారతీయ ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారు ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటారన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఇప్పటివరకు విమానయాన సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిసింది.

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చిక్కుకుపోయిన భారతీయులు..40 గంటలుగా ఎదురుచూపులు..
Mumbai-London Atlantic Flight

Updated on: Apr 04, 2025 | 11:36 AM

లండన్‌ నుంచి ముంబయికి బయలుదేరిన ఓ విమానాన్ని అధికారులు టర్కీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురి కావడంతో విమానాన్ని టర్కీలో ల్యాండ్‌ చేసినట్టుగా విమానాయ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో 16 గంటల నుంచి టేకాఫ్ చేయలేదు. అయితే ఈ విమానంలో సుమారు 200 మంది భారతీయులు ఉండడంతో వారంతా అవస్థలు పడుతున్నట్లు సమాచారం.

ఈ ఘటనతో, అక్కడి మారుమూల విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 200 మంది భారతీయ ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారు ఎప్పుడు గమ్యస్థానానికి చేరుకుంటారన్న విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఇప్పటివరకు విమానయాన సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు తగిన సౌకర్యాలు ఆ విమానాశ్రయంలో లేవని కొందరు ప్రయాణికులు వాపోయారు. సాధ్యమైనంత త్వరగా రవాణా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోరారు. కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు విమానయాన సంస్థ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..