లండన్ ఘాతుకం….. గర్ల్ ఫ్రెండ్ కోసం.. ఉగ్రవాదిగా మారి..

| Edited By: Pardhasaradhi Peri

Feb 06, 2020 | 10:01 AM

లండన్ లో సుదేష్ అమ్మాన్ అనే 20 ఏళ్ళ యువకుడు ఉన్మాదిగా మారి కత్తితో ఇద్దరిపై దాడి చేయడంతో పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కలిగిఉన్నందుకు గతంలో ఇతడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తరువాత కూడా సుదేష్ తీరు మారలేదు. 2018 నవంబరులో టెర్రరిస్టు డాక్యుమెంట్లు కలిగిఉన్నందుకు ఇతగాడు పట్టుబడ్డాడు. ఇతని కంప్యూటర్ ను, ఫోన్ ను పరిశీలించిన అధికారులకు […]

లండన్ ఘాతుకం..... గర్ల్ ఫ్రెండ్ కోసం.. ఉగ్రవాదిగా మారి..
Follow us on

లండన్ లో సుదేష్ అమ్మాన్ అనే 20 ఏళ్ళ యువకుడు ఉన్మాదిగా మారి కత్తితో ఇద్దరిపై దాడి చేయడంతో పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కలిగిఉన్నందుకు గతంలో ఇతడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తరువాత కూడా సుదేష్ తీరు మారలేదు. 2018 నవంబరులో టెర్రరిస్టు డాక్యుమెంట్లు కలిగిఉన్నందుకు ఇతగాడు పట్టుబడ్డాడు. ఇతని కంప్యూటర్ ను, ఫోన్ ను పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సిరియాలో అమెరికా దళాల దాడిలో మృతి చెందిన ఐఎస్ లీడర్ అబూ బకర్-అల్ బాగ్దాదీ ఫోటో కనిపించడమే గాక తన గర్ల్ ఫ్రెండ్ తో ఇతడు చేసిన చాటింగ్ వారిని ఆశ్ఛర్యపోయేలా చేసింది నన్ను ప్రేమించాలంటే నీ తలిదండ్రుల తలలు నరకాలని సుదేష్ కోరాడట.. పూర్తిగా ఉగ్రవాద సాహిత్యాన్ని ఒంటబట్టించుకుని బ్రిటిష్ వారిని, అమెరికన్లను, యూదులను ద్వేషించే వ్యక్తిగా సుదేష్ మారాడు. యూదు మహిళలను రేప్ చేయాలన్న మెసేజెస్ ఇతని కంప్యుటర్లో కనిపించాయి. చివరకు ఇతడిని పోలీసులు కాల్చి చంపడంతో సుదేష్ కథ ముగిసింది.