శరణార్ధులే లక్ష్యంగా వైమానిక దాడి.. 40 మంది మృతి

| Edited By:

Jul 03, 2019 | 3:39 PM

లిబియా దేశ రాజధాని ట్రిపోలీ మంగళవారం రాత్రి బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఆఫ్రికా ఖండానికి చెందిన సుడాన్, సోమాలియా దేశాల శరణార్ధులే లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా మరణించగా.. మరో 80 మంది గాయపడ్డారు. ట్రిపోలీ సమీపంలోని తజౌరా సబర్బన్ ప్రాంతంలో దాదాపు 600 మందికి పైగా వలసదారులు నివసిస్తున్నారు. లిబియాలో నియంత గడాఫీ మరణానంతరం రెండు గ్రూపులుగా విడిపోయి పోరు సాగుతోంది. మంగళవారం రాత్రి జరిగిన వైమానిక దాడిని […]

శరణార్ధులే లక్ష్యంగా వైమానిక దాడి.. 40 మంది మృతి
Follow us on

లిబియా దేశ రాజధాని ట్రిపోలీ మంగళవారం రాత్రి బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఆఫ్రికా ఖండానికి చెందిన సుడాన్, సోమాలియా దేశాల శరణార్ధులే లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయి. ఈ ఘటనలో 40 మందికి పైగా మరణించగా.. మరో 80 మంది గాయపడ్డారు. ట్రిపోలీ సమీపంలోని తజౌరా సబర్బన్ ప్రాంతంలో దాదాపు 600 మందికి పైగా వలసదారులు నివసిస్తున్నారు. లిబియాలో నియంత గడాఫీ మరణానంతరం రెండు గ్రూపులుగా విడిపోయి పోరు సాగుతోంది. మంగళవారం రాత్రి జరిగిన వైమానిక దాడిని ఆ దేశ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ధ్రువీకరించారు.