ఏ యుద్ధమైనా భూమి కోసమే.. బర్మా యుద్ధం నుంచి బలుచిస్తాన్ పోరు వరకూ.

పాకిస్తాన్‌, చైనా.. ఈ రెండు దేశాలకు సరిహద్దు ప్రాంతం కశ్మీర్. సైనికపరంగా, భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. అంతేనా..! సింధూ, చీనాబ్, జీలం, రావి, సట్లేజ్, బియాస్‌.. ఈ ఆరు నదులు కశ్మీర్‌లోనే ప్రవహిస్తాయి. ఇక ఖనిజ సంపద అపారం. 500లకు పైనే మినరల్‌ బ్లాక్స్‌ ఉన్నాయి. మనదేశంలో బోరాక్స్‌, నీలమణి అని పిలిచే సఫైర్‌ దొరికే ఏకైక ప్రాంతం కశ్మీర్. రీసెంట్‌గా బ్యాటరీల తయారీకి ఉపయోగించే లిథియం.. కొండలకొద్దీ ఉందని బయటపడింది. ఇన్ని సహజ వనరులు, ఇంతటి ఖనిజ సంపద ఉండడం కూడా కశ్మీర్‌పై పట్టుకు ఓ కారణం. ఈ ప్రాంతం పాక్ వశం అయితే.. అందులోని సంపదను వాడుకోవాలనేది చైనా కుట్ర. సో, భారత్‌-పాక్‌ మధ్య నాలుగు యుద్ధాలు జరిగాయంటే ఒకే ఒక్క కారణం.. కశ్మీర్‌ భూభాగం.

ఏ యుద్ధమైనా భూమి కోసమే.. బర్మా యుద్ధం నుంచి బలుచిస్తాన్ పోరు వరకూ.
War Zone

Updated on: May 23, 2025 | 9:50 PM

భూమి బంగారం. అది ఒక అంగుళమైనా రాష్ట్రమంత సైజ్‌లో ఉన్నా సరే.. భూమి విలువైనది. జరుగుతున్న యుద్ధాలన్నీ ఆ భూభాగం కోసమే. కశ్మీర్‌ మొత్తం భారత్‌దేనంటూ అప్పటి రాజు స్వయంగా రాసిచ్చినా సరే.. పాక్‌ ఆ భూభాగం తమకే కావాలంటూ కయ్యానికి కాలు దువ్వింది. స్వాతంత్రం వచ్చిన ఏడాదిలోనే- 1947లో మొదటిసారి భారత్-పాక్‌ మధ్య యుద్ధం జరిగింది. అదే మొదటి కశ్మీర్‌ యుద్దం. కాని, కశ్మీర్‌ రాజు భారత్‌ను సంప్రదించడం, కాగితాలపై సంతకాలు చేయడం, సంపూర్ణ కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించే సరికి చాలా సమయం గడిచిపోయింది. అప్పటికే మూడో వంతు భాగాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకుంది పాకిస్తాన్. అదే పీవోకే. మొదటి కశ్మీర్‌ యుద్ధంలో భారత్‌దే విజయం అయినా.. కశ్మీర్‌ వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. దాని ఫలితమే.. 1965లో మరోసారి యుద్ధం. కశ్మీర్‌లో తిరుగుబాటును రెచ్చగొట్టి, గిరిజన దళాలను కశ్మీర్‌లోకి పంపించింది. ఆ యుద్ధంలో భారత్‌దే పైచేయి. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినా అది కశ్మీర్‌ గురించి కాదు. బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగింది. కాని, 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం మాత్రం కశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్‌ చేసిన కుటిల ప్రయత్నమే. 2019లో బాలాకోట్‌ ఎయిర్‌స్ట్రైక్‌, మొన్నటి ఆపరేషన్‌ సింధూర్‌.. ఇవన్నీ జరిగింది కశ్మీర్‌ భూభాగం కోసమే. సో.. భూమి కోసం జరిగిన యుద్ధాల గురించి చెప్పాల్సి వస్తే మొదటగా చెప్పాల్సింది భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాల గురించే. ఇప్పటికీ ఎటూ తేలని యుద్ధం.....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి