ఖమేనీ ఉన్న ప్రదేశం ఎలా లీక్ అయింది? షెడ్యూల్ కంటే ముందే ఇరాన్‌పై ఎందుకు దాడి చేశాయి?

అమెరికా నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా గమనిస్తోంది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు ముందుగానే గుర్తించారు. కానీ ఏ భవనంలో సమావేశమవుతున్నారని స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని శనివారం ఉదయానికి మార్చడంతో అది లీకైంది.

ఖమేనీ ఉన్న ప్రదేశం ఎలా లీక్ అయింది? షెడ్యూల్ కంటే ముందే ఇరాన్‌పై ఎందుకు దాడి చేశాయి?
Iran's Supreme Leader Ayatollah Ali Khamenei

Updated on: Mar 01, 2026 | 5:55 PM

ఇరాన్‌ను కుదిపేసిన పేలుళ్లు, సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం పశ్చిమాసియాను మరోసారి యుద్ధం అంచుకు తీసుకువచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఈ చర్యలు కేవలం సైనిక ఒత్తిడినా లేక ఇరాన్‌లో పాలన మార్పు ప్రారంభమా అనే ప్రశ్నలను లేవనెత్తాయి. ఆకస్మిక దాడిని సద్వినియోగం చేసుకోవడానికి దాడిలో ముందుగా ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడం అవసరమని అమెరికా అధికారి ఒకరు అన్నారు. అవకాశం ఉంటే ఇరాన్ సుప్రీం లీడర్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉండేవాడని ఆయన సూచించారు.

రాయిటర్స్ కథనం ప్రకారం, శనివారం (ఫిబ్రవరి 28, 2026) ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఒక అమెరికా అధికారి తెలిపారు. ” శనివారం సాయంత్రం టెహ్రాన్‌లో ఖమేనీ సమావేశం నిర్వహిస్తారని భావించారు, కానీ ఇజ్రాయెల్ నిఘా సంస్థలు శనివారం ఉదయం ఒక సమావేశాన్ని గుర్తించాయి, ఆ తర్వాత దాడిని ముందస్తుగా ఫ్లాన్ చేశారు” అని ఆయన అన్నారు.

అమెరికా నిఘా సంస్థ CIA ఇజ్రాయెల్‌తో కలిసి ఖమేనీ కదలికలపై కొన్ని నెలలుగా గమనిస్తోంది. పాలనా భవనాల్లో శుక్రవారం సాయంత్రం ఖమేనీ, ఇతరులు భేటీ కాబోతున్నట్లు ముందుగానే గుర్తించారు. కానీ ఏ భవనంలో సమావేశమవుతున్నారని స్పష్టం కాలేదు. అయితే సమావేశాన్ని శనివారం ఉదయానికి మార్చడంతో అది లీకైంది. ఏ టైమ్, ఎక్కడ అన్న కచ్చితమైన సమాచారంతో దాడిచేసినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త ఆపరేషన్ మొదట టెహ్రాన్‌లోని ఖమేనీ అధిక భద్రతా సమూహాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఉపగ్రహ చిత్రాలు ఆ సమావేశంలో పాల్గొన్న భవనం పూర్తిగా ధ్వంసమైందని నిర్ధారించాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడి ప్రారంభమైన వెంటనే, టెహ్రాన్ టెల్ అవీవ్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), జోర్డాన్, కువైట్‌లపై డ్రోన్లు, క్షిపణుల దాడితో ప్రతీకారం తీర్చుకుంది.

ఖమేనీ హంతకులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రతిజ్ఞ చేసింది. అమెరికా – ఇజ్రాయెల్‌పై చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో అత్యంత ఘోరమైన దాడిని ప్రారంభిస్తామని IRGC హెచ్చరించింది. మాజీ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ షంఖానీ, IRGC కమాండర్ మొహమ్మద్ పక్‌పూర్‌తో సహా అతని అగ్ర సహాయకులతో పాటు ఖమేనీ కూడా హత్యకు గురయ్యారని ఇజ్రాయెల్ తెలిపింది.

దాడి ప్రారంభానికి కొద్దిసేపటి ముందు, శనివారం నాడు ఖమేనీ, షంఖానీ, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని సురక్షితమైన ప్రదేశంలో కలిశారని రెండు ఇరాన్ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరాన్ స్టేట్ టెలివిజన్ ఆదివారం (మార్చి 1, 2025) ఆయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని ధృవీకరించింది. ఇరాన్ మీడియా కూడా ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించినట్లు పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us