వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్ నగరం, 8 మంది పౌరులు మృతి

|

Nov 21, 2020 | 2:09 PM

అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి వరుస పేలుళ్లు సంభవించాయి..ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది పౌరులు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది..

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్ నగరం, 8 మంది పౌరులు మృతి
Follow us on

అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి వరుస పేలుళ్లు సంభవించాయి..ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది పౌరులు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.. కాబూల్‌లోని గ్రీన్‌జోన్‌కు దగ్గరలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లు, రాకెట్ల దాడులు జరిగాయి.. 20కిపైగా రాకెట్లు ప్రయోగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ దాడిలో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రాంతంలోనే పలు దేశాల రాయబార కార్యాలయాలు ఉన్నాయి.. అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ ఎక్కువ.. అయితే ఇది తాలిబన్‌ల పనేనా? లేక మరెవరైనా ఈ దురాగతానికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది.. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్‌ ప్రకటించింది.. ఖతార్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, తాలిబన్‌ మధ్య ఇవాళ చర్చలు జరగనున్న కొద్ది గంటల ముందు పేలుళ్లు సంభవించడం గమనించదగ్గ విషయం. నిజానికి అఫ్గన్‌ ప్రభుత్వం, తాలిబన్‌ మధ్య మొన్న సెప్టెంబర్‌లోనే శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.. అయితే ఇవి ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి.. ఓ వైపు చర్చలు జరుపుతూనే మరోవైపు తాలిబన్‌ పేలుళ్లకు పాల్పడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.