Italian Village Selling Homes: ఇటలీలో సికిలీలో రూ.90లకే ఇల్లు.. బేరం చేస్తే ఇంకా తగ్గించవచ్చు.. బట్ కండిషన్స్ అప్లై

|

Feb 07, 2021 | 6:42 AM

పల్లెలు కాళీ అవుతున్నాయి. దీంతో మళ్ళీ పల్లె కళకళలాడాలని ఓ మేయర్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.. ఓ గ్రామంలోని ఇళ్లను కేవలం రూ. 90 లకే విక్రయించడానికి రెడీ...

Italian Village Selling Homes: ఇటలీలో సికిలీలో రూ.90లకే ఇల్లు.. బేరం చేస్తే ఇంకా తగ్గించవచ్చు.. బట్ కండిషన్స్ అప్లై
Troina is the latest Italian town
Follow us on

Italian Village Selling Homes: సొంత ఇల్లు అనేది మనదేశం వారికే కాదు.. ఏ దేశస్థులకైనా కలే.. అదే సమయంలో గ్రామంలోని ప్రజలు బతుకుతెరువు, పిల్లల చదువులు, ఉద్యోగాలు అంటూ రకరకాల కారణాలతో పట్నం బాట పడుతున్నారు. ఇది ఒక్క మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ప్రతి గ్రామంలో జరుగుతున్నదే .. ఈ నేపథ్యంలో పల్లెలు కాళీ అవుతున్నాయి. దీంతో మళ్ళీ పల్లె కళకళలాడాలని ఓ మేయర్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.. ఓ గ్రామంలోని ఇళ్లను కేవలం రూ. 90 లకే విక్రయించడానికి రెడీ అయ్యారు.. ఈ ఘటన ఇటలీదేశంలో చోటు చేసుకుంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా నిజమే… వివరాలోకి వెళ్తే..

ఇటలీలోని సికిలీ గ్రామంలో ఇళ్లు అమ్మకానికి పెట్టారు. కేవలం 90రూపాయలకు ఇంకా బేరమాడితే అంతకంటే తక్కువకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. కాకపోతే ఆదిమళ్ళీ అది రెనోవేట్ చేయించుకోవాలి. సికిలీ గ్రామంలోని ప్రజలు అందరూ ఖాళీ చేసి పట్నం వెళ్లిపోయారు. దీంతో ఆ గ్రామంలో జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మేయర్ వారందరినీ వెనక్కురప్పించాలని..గ్రామానికి పూర్వ వైభవం తీసుకుని రావాలని మేయర్ సెబాస్టియానో ఫాబియో వెనెజియా ప్లాన్ చేశారు.

కొండలపై నిర్మించినబడిన సికిలీ గ్రామం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దాదాపు 4వేల హెక్టార్ల మేర ఇళ్లున్న గ్రామం. ఇక చుట్టూ అటవీ ప్రాతం ఉండడంతో ప్రశాంతమైన ప్రదేశం. ఇక గుర్రపు స్వారీలకు చాలా అనువుగా ఉంటాయి. అక్కడ వాతావరణానికి తగ్గట్లుగా గాడిదలు, బ్రెడ్, తాజా కూరగాయలు అందుబాటులో ఉండటంతో పాటు కాలుష్య రహిత ప్రాంతంగా మంచి గుర్తింపు కూడా ఉంది.

ఆ గ్రామస్థులకు ఆ ప్రశాంత వాతావరణం నచ్చలేదు.. బిజీ జీవితాన్ని కలనుకుని పట్నం పయనమయ్యారు. వివిధ పట్టణాల్లో స్థిరపడ్డారు కూడా. అయితే సిటీ లైఫ్ లో ఉండే రణగొణ ధ్వనులనుంచి ఉపశమనం కావాలనుకునే వారికీ ఈ గ్రామం బెస్ట్ ఆప్షన్. ఆయితే ఇక్కడ ఇల్లు కొనడం ఇటలీ దేశస్థులకు ఈజీనే.. కానీ అదే ఇతర దేశాల వారైతే కొన్ని నియనిబంధనలు ఉన్నాయి.
భారతీయులైతే.. మళ్ళీ దానిని రెనోవేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాని కంటే ముందు డిపాజిట్ అమౌంట్ కింద 5వేల యూరోలు మన కరెన్సీలో దాదాపు రూ. 43లక్షలు జమ చేయాలి. మొత్తం రెనోవేషన్ అయిపోయిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. అయితే రేనోవేషన్ చేయించుకోకుండా కూడా ఇల్లుకొనుక్కోవాలి అనుకుంటే రూ. 86 లక్షలు అవుతుంది.

Also Read:

మరో రెండు ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్న మైక్రో సాఫ్ట్‌ అధినేత.. సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్‌..

వీధుల్లో ప్రవహించిన ‘రక్తపు వరద’.. ఆందోళనలో ప్రజలు… ఇంతకీ అసలు విషయమేంటంటే..