ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా(Corona virus) ఉద్ధృతి ప్రస్తుతం మూడో దశ కొనసాగుతోంది. ఈ మహమ్మారి వల్ల ఎంతోమంది తమ ఆప్తులను కోల్పోయారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మందులు, టీకా(vaccine)లు వంటి వాటితో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలుగుతున్నాం. అయితే టీకా వేసుకున్న వారిలోనూ మళ్లీ కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా ఒకసారి వైరస్ సోకిన వారిలోనూ మరో సారి ప్రత్యక్షమవుతోంది. అయితే టర్కీ(Turkey)కి చెందిన ఓ వ్యక్తికి ఒకటి కాదు, రెండు కాదు.. 78 సార్లు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ఆతను 14 నెలలుగా ఐసోలేషన్ లోనే ఉన్నాడు. తన పరిస్థితిపై కన్నీటిపర్యంతమవుతున్నాడు.
టర్కీలోని ఇస్తాంబుల్‌లో నివాసముంటున్న 56 ఏళ్ల ముజాఫర్ కయాసన్‌కు నవంబరు 2020లో మొదటిసారి కరోనా వైరస్ సోకింది. వైద్యులను సంప్రదించి మందులు వాడాడు. అయినప్పటికీ కరోనా తగ్గకపోవడంతో చివరికి హాస్పిటల్ లో చేరాడు. తీవ్రత తగ్గాకు డిశ్ఛార్జ్ అయ్యాడు. అయినా కరోనా లక్షణాలు అలాగే కొనసాగాయి. గడిచిన 14 నెలల్లో ఎన్నిసార్లు చికిత్స చేయించుకున్నా.. అతడికి పాజిటివ్ మాత్రమే వస్తోంది. దీంతో అతడు నిత్యం ఐసోలేషన్‌లోనే ఉండాల్సి వస్తోంది. ఫలితంగా కుటుంబ సభ్యులనూ కలవలేని దుస్థితి నెలకొంది. 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఐసోలేషన్ లోనే ఉన్నాడు. ముజాఫర్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ యాక్టివ్‌గా లేకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని అతడికి చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.
‘‘కోవిడ్ వల్ల నేను వ్యాక్సిన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒకే గదిలో ఐసోలేషన్‌లో ఉండటం బాగానే ఉంది. కానీ, నా కుటుంబీకులతో ఎప్పటిలా కలిసి ఉండలేకపోతున్నా అనే బాధ వెంటాడుతోంది. వారిని కనీసం ముట్టుకోలేని దయనీయ స్థితిలో ఉన్నా.” అని ముజాఫర్ కంటతడి పెట్టాడు. తనకు కొవిడ్ ఎందుకు తగ్గడం లేదో తెలియదని, దీనికి తగిన పరిష్కారం సూచించాలని ముజాఫర్ అధికారులను కోరుతున్నాడు.
Also Read
Vitamin-D: మీరు రుచి, వాసన కోల్పోతున్నారా..? ఈ విటమిన్ లోపం కావచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు
Tollywood: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన సినీ పెద్దలు..
Chennai BJP Office Attack: చెన్నై బీజేపీ కార్యాలయంపై దాడి.. పెట్రోల్ బాంబులు విసిరిన దుండగులు..