
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈసారి దాడి ఇజ్రాయెల్ నుంచి కాదు. ఇరాన్ నుంచి ఎటాక్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఒకటి రెండు రోజుల్లోనే దాడి జరిగే ఛాన్స్ ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అజ్ఞాతాన్ని వీడి రావడం.. ఆ తర్వాత కీలక భేటీలవుతుండటం సంచలనంగా మారింది. ఇరాన్‌లో మొహర్రం సంతాప దినాలు ముగిసిన వెంటనే ఖమేనీ ఇజ్రాయెల్‌పై యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఖమేనీ ఆదేశాలు ఇచ్చిన వెంటనే ఇజ్రాయెల్‌పై మిసైల్ల వర్షం కురిపించడానికి ఇరాన్ సైన్యం ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం. ఇజ్రాయెల్‌పై ఇంత సడన్ ఎటాక్‌కు ఖమేనీ ఎందుకు ప్లాన్ చేశారంటే…? ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు… ట్రంప్‌తో అమెరికా వెళ్తున్నారు. ఈ నెల 7న వాషింగ్టన్‌లో ట్రంప్‌తో నేతన్యాహు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇదే సయమంలో ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా సాయం కోరే అవకాశం ఉంది. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్‌కు అమెరికా మళ్లీ సాయం చేస్తే ఈసారి ఇరాన్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఖమేనీ మళ్లీ ఆ అవకాశాన్ని శత్రు దేశానికి ఇవ్వలనుకోవడం లేదు. అందుకే సడన్ ఎటాక్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదికూడా ఒకటి రెండు రోజుల్లోనే ఈ వ్యూహాలన్ని అమలు పరిచి నెతన్యాహుకు...