Israel Palestine War: పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులను బంధించి, హింసించి హత్య చేస్తోన్న హమాస్.. ఇజ్రాయిల్ ఆర్మీ వివరాలు వెల్లడి.

యుద్ధం మొదలు పెట్టి 24 గంటలు కూడా గడవలేదు.. ఇరు దేశాల్లో సుమారు 500 మంది మరణించారు. యుద్ధంలో వేలాది మంది సైనికులు, పౌరులు గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదులు ఈ దాడుల్లో అమాయక పౌరులను హతమార్చడమే కాకుండా మహిళలు, చిన్నారులను బందీలుగా పట్టుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇజ్రాయెల్ ఆర్మీ బంధీలుగా పట్టుకున్న వారి ఛాయా చిత్రాలను విడుదల చేసింది.  హమాస్ భారీ సంఖ్యలో మహిళలను బంధించిందని .. కొందరిని చంపిందని పేర్కొంది.

Israel Palestine War: పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులను బంధించి, హింసించి హత్య చేస్తోన్న హమాస్.. ఇజ్రాయిల్ ఆర్మీ వివరాలు వెల్లడి.
Israel Palestine War

Updated on: Oct 08, 2023 | 11:36 AM

హమాస్ హఠాత్తుగా ఇజ్రాయిల్ పై విరుచుకుపడింది. ఒక్కసారిగా వేలాది రాకెట్స్ తో ఇజ్రాయిల్ పై విరుచుకుపడి భారీ నష్టం చేకూర్చింది. ఈ ఘటన ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య యుద్ధానికి దారి తీసింది. ఇజ్రాయిల్ కూడా గాజాపై దాడులు మొదలు పెట్టింది. దీంతో రెండు వైపులా భారీ విధ్వంసం కనిపిస్తోంది. యుద్ధం మొదలు పెట్టి 24 గంటలు కూడా గడవలేదు.. ఇరు దేశాల్లో సుమారు 500 మంది మరణించారు. యుద్ధంలో వేలాది మంది సైనికులు, పౌరులు గాయపడ్డారు. హమాస్ ఉగ్రవాదులు ఈ దాడుల్లో అమాయక పౌరులను హతమార్చడమే కాకుండా మహిళలు, చిన్నారులను బందీలుగా పట్టుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇజ్రాయెల్ ఆర్మీ బంధీలుగా పట్టుకున్న వారి ఛాయా చిత్రాలను విడుదల చేసింది.  హమాస్ భారీ సంఖ్యలో మహిళలను బంధించిందని .. కొందరిని చంపిందని పేర్కొంది.

పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులను పట్టుకున్న హమాస్

ఇజ్రాయెల్ భద్రతా సంస్థలు శనివారం చర్యలు చేపట్టే సమయానికే, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్  యోధులు ఇజ్రాయెల్‌లోకి భూమి, నీరు, ఆకాశం ద్వారా చొరబడి ప్రజలపై దాడి చేయడం.. ప్రజలను బందీలుగా తీసుకోవడం, చంపడం, కొట్టడం వంటి దారుణాలకు పాల్పడ్డారు. హమాస్ కు పట్టుబడిన వారిలో పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఉన్నారని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.

కొందరు సజీవంగా ఉన్నారు, కొందరు హత్య చేయబడ్డారు – ఇజ్రాయెల్ సైన్యం

ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ మాట్లాడుతూ హమాస్ పట్టుకున్న వారిలో  కొందరు సజీవంగా ఉన్నారని, మరికొందరు చనిపోయినట్లుగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో హమాస్ యోధులు ఇజ్రాయెల్ మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. రక్తంలో తడిసిన మహిళలను బలవంతంగా గాజా స్ట్రిప్ వైపు వాహనాల్లో తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు.

గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్‌ సైన్యం నిరంతర దాడులు కొనసాగుతున్నాయి. హమాస్ యోధులు ఇజ్రాయెల్‌పై ఒకదాని తర్వాత ఒకటి రాకెట్, ల్యాండ్‌మైన్ దాడులు చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లోని పౌరులు కూడా హమాస్ ఉగ్రవాదులపై దాడులకు పాల్పడుతున్నారు. హమాస్ ఉగ్రవాదులను నివారిస్తున్నారు.

మరోవైపు ఇజ్రాయెల్ కూడా హమాస్ లక్ష్యాలపై విధ్వంసం సృష్టించింది. జికిమ్ బీచ్‌పై వైమానిక దళం భీకర దాడి చేసింది. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే హమాస్ యోధులను ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఒంటరి  చేసింది. ఇజ్రాయెల్ దాడిలో చాలా మంది హమాస్ యోధులు మరణించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..