Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వెనుక ఉన్న దేశం ఏది? హమాస్‌కు రాకెట్లు, బాంబులు ఎవరు ఇచ్చారు?

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడికి వెనుక ఉన్న ఆలోచన ఎవరిదీ? హమాస్ ను ప్రేరేపిస్తున్న వ్యక్తి, అతనికి సహాయం చేస్తున్న వారు ఎవరు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వంటి ఆయుధ సంపన్న దేశంలో ఇంత పెద్ద దాడి చేయడానికి ప్రస్తుతం హమాస్ కు అంతగా ఆర్ధిక బలం లేదు. హమాస్ దాడిలో ఇప్పటివరకు 200 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. హమాస్ తీవ్రవాదులు అమాయకులను కూడా విడిచిపెట్టలేదు.

Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం వెనుక ఉన్న దేశం ఏది? హమాస్‌కు రాకెట్లు, బాంబులు ఎవరు  ఇచ్చారు?
Israel Palestine War

Updated on: Oct 08, 2023 | 12:46 PM

ఏడాదికి పైగా రష్యా, యుక్రెయిన్ ల మధ్య యుద్ధం కొనాగుతూనే ఉన్నది. తాజాగా ఇప్పుడు పాలస్తీనా, ఇజ్రాయిల్ ల మధ్య యుద్ధం మొదలైంది. నిన్నా మొన్నటి వరకూ తమ యోధానులకు జీతాలు చెల్లించడానికి డబ్బులు లేవని చెప్పిన హమాస్.. ఒక్కసారిగా ఇజ్రాయిల్ గడ్డపై విరుచుకుపడి విధ్వసం సృష్టించింది. దీంతో నేడు హమాస్ విషయంలో మరొకటి సూచిస్తోంది. ఇజ్రాయెల్ గడ్డపై విధ్వంస దృశ్యాన్ని చూసిన వారి మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హమాస్ .. ఇజ్రాయిల్ పై  7000కు పైగా రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇన్ని రాకెట్లను ప్రయోగించేటంత డబ్బు కొన్ని నెలల్లో ఎక్కడి నుంచి  తెచ్చుకున్నారనే ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది.

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా దాడికి వెనుక ఉన్న ఆలోచన ఎవరిదీ? హమాస్ ను ప్రేరేపిస్తున్న వ్యక్తి, అతనికి సహాయం చేస్తున్న వారు ఎవరు అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ వంటి ఆయుధ సంపన్న దేశంలో ఇంత పెద్ద దాడి చేయడానికి ప్రస్తుతం హమాస్ కు అంతగా ఆర్ధిక బలం లేదు

ఇవి కూడా చదవండి

హమాస్ దాడిలో ఇప్పటివరకు 200 మంది మరణించగా, 1000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. హమాస్ తీవ్రవాదులు అమాయకులను కూడా విడిచిపెట్టలేదు. ఈ దాడిలో పలువురు అమాయకులు గాయపడ్డారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలో భాగంగా గాజాపై దాడి చేసింది. రాకెట్ల వర్షం కురిపించింది. ఈ దాడిలో కనీసం 198 మంది మరణించారు. 1600 మందికి పైగా గాయపడ్డారు.

హమాస్‌కు నిధులు ఎక్కడనుంచి వస్తున్నాయి?

ఇస్లామిక్ దేశాలన్నీ హమాస్‌కు నిధులు సమకూరుస్తున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ముఖ్యంగా ఖతార్ పేరుని ప్రస్తావిస్తోంది. ఖతార్ ఒక్కటే హమాస్‌కు 1.8 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందించిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. హమాస్‌కు ప్రపంచవ్యాప్తంగా మద్దతుదారులు ఉన్నారు. భారీ  మొత్తంలో విరాళాలు కూడా ఇచ్చారు. దీంతో హమాస్ కు బలం చేకూరినట్లు అయి..  శక్తిమంతమైన ఇజ్రాయెల్ వైపు చూసేందుకు.. యుద్ధం చేసేందుకు సాహసించింది. దీంతో ఇప్పుడు అక్కడ భీకర యుద్ధ పరిస్థితి తలెత్తింది.

రష్యా, అమెరికా పేర్లు కూడా తెరపైకి

ఈ దాడి వెనుక రష్యా హస్తం ఉందని కొందరంటే.. మరికొందరు అమెరికాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ దాడిలో అమెరికా ప్రమేయం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆరోపించారు. అమెరికా పన్ను చెల్లింపుదారులు హమాస్‌కు నిధులు సమకూరుస్తున్నారని చెప్పారు. దాడి తర్వాత హమాస్ చీఫ్ దోహాలో సంబరాలు జరుపుకోవడంతో ఖతార్‌పై కూడా అనుమానం వ్యక్తమవుతుంది. హమాస్ వద్ద ఆయుధాల నిల్వ ఉంది. ఇరాన్ నుంచి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను హమాస్ సొంతం చేసుకుంది. ఈ దాడి తర్వాత ఇరాన్ పార్లమెంట్‌లో సంబరాలు జరిగాయి.

హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగానికి ఎలా చేరుకున్నారు?

మీడియా నివేదికల ప్రకారం శనివారం ఉదయం హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌లోని ఏడు నగరాలపై రాకెట్లతో అకస్మాత్తుగా దాడి చేశారు. హమాస్ మూడు ఫ్రంట్‌ల నుండి ఇజ్రాయెల్ స్థానాలను లక్ష్యంగా చేసుకుంది. కొన్ని చోట్ల రాకెట్లు ప్రయోగించగా కొన్ని చోట్ల ఇజ్రాయెల్ ప్రాంతాల్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఇరు దేశాల మధ్య విపరీతమైన టెన్షన్ నెలకొంది. ఇది కేవలం ఒక దేశంపై ఒకరు పోరు చేసుకోవడం మాత్రమే కాదు..  హమాస్ యోధులు చాలా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. ఇజ్రాయెల్ పై జరిగిన ఈ సరిహద్దు యుద్ధానికి గాజా స్ట్రిప్ ప్రధాన కేంద్రం.

 ఇజ్రాయెల్‌పై 7000 రాకెట్లను ప్రయోగించిన హమాస్

హమాస్..  ఇజ్రాయెల్‌పై ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు వేలకు పైగా రాకెట్లను ప్రయోగించింది. అనేక ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుంది. గాజా నుంచి రాకెట్ దాడి జరిగింది. దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. దాడి తర్వాత ఇజ్రాయెల్‌లో తొక్కిసలాట జరిగింది. వేలాది మంది ప్రజలు భయంతో పరుగులు తీయడం కనిపించింది. దాడి అనంతరం ఆరోపణలు, ప్రత్యారోపణల పరంపర మొదలైంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..