Israel Palestine War: ఇజ్రాయిల్ లో హమాస్ విధ్వసం.. 900మంది మృతి.. ఏ దేశ పౌరులు ఎంత మంది మరణించారంటే

|

Oct 10, 2023 | 8:17 AM

మిడిల్ ఈస్ట్ మొత్తం మారే విధంగా హమాస్ దాడికి సమాధానం ఇస్తుందని నెతన్యాహు హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు కానీ ముగిస్తాం. హమాస్ దాడులను చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, జర్మనీ, ఇటలీ సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఏకంగా అమెరికా నేవీ దళాన్ని, యుద్ధ విమానాలను రెడీ చేసింది.

Israel Palestine War: ఇజ్రాయిల్ లో హమాస్ విధ్వసం.. 900మంది మృతి.. ఏ దేశ పౌరులు ఎంత మంది మరణించారంటే
Israel Palestine Conflict
Follow us on

హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయిల్ పై విరుచుకుపడింది. భూమి, నేల, నింగి మూడు విధాలుగా దాడి చేసి బీభత్సం సృష్టించింది. గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. నేడు  నాల్గవ రోజు. ఈ నాలుగు రోజుల యుద్ధంలో  ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 900 మందికి పైగా మరణించారు.  2600 మందికి పైగా గాయపడ్డారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రతీకారంగా చేసిన దాడిలో గాజాలో 680 మందికి పైగా మరణించారు. 3500 మందికి పైగా గాయపడ్డారు.

శనివారం ఉదయం హమాస్..  ఇజ్రాయిల్ పై శర వేగంగా దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పై హమాస్ 5000కు పైగా రాకెట్లను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా గాజా స్ట్రిప్‌లో భారీ బాంబు దాడులు చేసింది. వందలాది రహస్య స్థావరాలను ధ్వంసం చేసింది. హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధం ప్రకటించారు. దీనికి హమాస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.

హమాస్‌ను నిర్మూలిస్తామన్న ఇజ్రాయిల్

మిడిల్ ఈస్ట్ మొత్తం మారే విధంగా హమాస్ దాడికి సమాధానం ఇస్తుందని నెతన్యాహు హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు కానీ ముగిస్తాం. హమాస్ దాడులను చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, జర్మనీ, ఇటలీ సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచాయి. ఏకంగా అమెరికా నేవీ దళాన్ని, యుద్ధ విమానాలను రెడీ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇజ్రాయెల్‌లో హమాస్‌ విపత్తు

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులలో అమెరికాతో సహా అనేక దేశాల నుండి చాలా మంది మరణించారు, చాలా మంది తప్పిపోయారు. కొంతమంది బందీలుగా ఉన్నారు. ఇది పూర్తి జాబితా

  1. థాయ్‌లాండ్: 12 మంది మృతి, 11 మంది బందీలుగా ఉన్నారు
  2. అమెరికా: 11 మంది మృతి, అనేకమంది అదృశ్యమయ్యారు
  3. నేపాల్: 10 మంది మరణించారు
  4. అర్జెంటీనా: 7 మంది మృతి, 15 మంది తప్పిపోయారు
  5. ఉక్రెయిన్: 2 మంది మృతి
  6. ఫ్రాన్స్: ఇద్దరు మృతి, 14 మంది తప్పిపోయారు
  7. రష్యా: 1 మృతి, 4 తప్పిపోయారు
  8. థాయ్‌లాండ్: 12 మంది మృతి, 11 మంది బందీలుగా ఉన్నారు
  9. బ్రిటన్: ఒకరు మృతి, ఒకరు తప్పిపోయారు
  10. కెనడా: ఒకరు మృతి, ముగ్గురు తప్పిపోయారు
  11. కంబోడియా: 1 మృతి
  12. జర్మనీ: అనేక బంధీలుగా ఉన్నట్లు తెలుస్తోంది
  13. బ్రెజిల్: ముగ్గురు తప్పిపోయారు
  14. చిలీ: 2 ఎటువంటి సమాచారం లేదు
  15. ఇటలీ: 2 మంది తప్పిపోయారు
  16. పరాగ్వే: 2 తప్పిపోయాయి
  17. పెరూ: 2 ఎటువంటి సమాచారం లేదు
  18. టాంజానియా: 2 తప్పిపోయారు
  19. మెక్సికో: 2 బందీలు
  20. కొలంబియా: 2 బందీలు
  21. ఫిలిప్పీన్స్: 6 మంది తప్పిపోయారు, ఒకరు బందీగా ఉన్నారు
  22. పనామా: ఒకరి గురించి ఎటువంటి సమాచారం లేదు
  23. ఐర్లాండ్: కరి గురించి ఎటువంటి సమాచారం లేదు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..