చిన్న పిల్లలను చూస్తే ఎవరైనా ఆకర్షింపబడతారు. ఎందుకంటే కల్లాకపటం లేనివారు చిన్నారులు. కళ్లలో మెరుపు, ముఖంలో మనోహరమైన చిరునవ్వుతో ఎంతటి వారి మనసునైనా గెలుచుకుంటారు. అయితే దురదృష్టవశాత్తు ఓ అమాయక చిన్నారి ఆ ఉగ్రవాదుల హృదయాలను గెలుచుకోలేకపోయాడు. ఆ బాలుడిని బందీగా తీసుకునే సమయంలో కూడా హమాస్ యోధుల గుండె కరగలేదు. నిజానికి హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. 9 నెలల వయసు ఉన్న ఈ చిన్నారి తన కుటుంబంతో సహా బందీగా ఉన్నాడు. ఈ చిన్నారి పేరు కేఫీర్ బిబాస్.
సమాచారం ప్రకారం 9 నెలల చిన్నారి కేఫీర్ బిబాస్ తన నాలుగు సంవత్సరాల అన్నయ్యతో కలిసి తల్లిదండ్రులతో ఇజ్రాయెల్‌లోని కిబ్బట్జ్‌లో నివసించేవాడు. ఇప్పుడిప్పుడే మోకాళ్లమీద పాకడం ప్రారంభించాడు. అయితే హమాస్ చేసిన దాడితో ఒక్క క్షణంలో కేఫీర్ .. అతని కుటుంబ సభ్యుల జీవితం శాశ్వతంగా మారిపోయింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో.. ఉగ్రవాదులు కేఫీర్ బిబాస్ ను అతని నాలుగేళ్ల సోదరుడు, తల్లి షిరి,తండ్రి యార్డెన్‌లను బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లారు.
32 మంది చిన్నారులు సహా 240 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. ఆ పిల్లలలో 9 నెలల కేఫీర్ చిన్నవాడు. కేఫీర్‌ని బందీగా పట్టుకున్నప్పుడు.. అతని వయస్సు 9 నెలలు.. కిడ్నాప్ చేసి ఒక నెల అయ్యింది. ఇప్పుడు అతనికి 10 నెలలు. ఇప్పుడు నడుస్తూ ఉండవచ్చు. అయితే గత నెల రోజులుగా కేఫీర్ లేదా అతని కుటుంబం గురించి ఎటువంటి వార్తా బయటకు వెలువడండం లేదు. దీంతో కేఫీర్ బిబాస్ తాత తమ కుటుంబం విడుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు 66 ఏళ్ల కేఫీర్ తాత ఎలి బిబాస్ తన కొడుకు, కోడలు, ఇద్దరు మనవళ్ల కోసం తన కుటుంబం కూడా విడుదల కానున్న వారిలో ఉండవచ్చనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. మీడియాతో మాట్లాడిన ఎలి బిబాస్ తన కొడుకు, కోడలు, ఇద్దరు మనవరాళ్లే తన జీవితం అని.. తన కొడుకు ఫ్యామిలీ ఇంటికి తిరిగి వస్తే చూడాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తమ కొడుకు కుటుంబానికి విముక్తి లభిస్తుందని.. బయట వెలుగులు చూస్తారని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
ఎలి బిబాస్ తన కుటుంబం కిడ్నాప్ చేయబడిన తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. అందులో అతని కోడలు షిరి తన ఇద్దరు కుమారులను తన ఒడిలో పట్టుకున్నట్లు కనిపించిందని చెప్పాడు. ఆమె చుట్టూ ఉగ్రవాదులున్నారు. వారి ముఖంలో భయం, నిస్సహాయత షిరీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనితో పాటు కొన్ని రోజుల తర్వాత తన కుమారుడు యార్డెన్ బిబాస్ రక్తంలో తడిసిన ఉన్న మరొక చిత్రం కనిపించిందని ఎలి చెప్పాడు. చిత్రంలో ఒక ఉగ్రవాది యార్డెన్ మెడ పట్టుకుని కనిపించాడని పేర్కొన్నాడు.
This beautiful baby boy Kfir Bibas was just nine months old when he was ripped from his home and kidnapped by Hamas terrorists.
He is now 10 months old and still being held hostage in Gaza.
Pray for the return of Kfir, his big brother Ariel, his mother Shiri and father… pic.twitter.com/lyqehDslOG
— Israel ישראל 🇮🇱 (@Israel) November 12, 2023
ఎలీ బిబాస్ కుటుంబమే కాదు హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయని, ప్రతిరోజూ భయంతో బతకాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. హమాస్ ఉగ్రవాదుల చెర నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో తెలియదు. అయితే సురక్షితంగా తమ ఫ్యామిలీ తిరిగి వస్తారని బాధితుల కుటుంబాలు ఆశాభావంతో ఉన్నాయి. అయితే ఈ కుటుంబాల ఆశ ఎప్పుడు నెరవేరుతుందో ఎవరికీ తెలియదు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఎన్ని ఇళ్లు శిథిలాలుగా మారాయో, ఎన్ని కుటుంబాలు నాశనమయ్యాయో లెక్కే లేదు. రెండు దేశాల వైపులా విధ్వంసం చూపరుల కంట తడి పెట్టిస్తోంది. అయినప్పటికీ ఇజ్రాయెల్ .. హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. హమాస్‌పై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. హమాస్‌ను నిర్మూలించే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..