పగ.. పగ.. తీర్చుకున్నాం.. చూస్తారా మా వీడియో..?: ఐసిస్

| Edited By:

Apr 24, 2019 | 1:06 PM

శ్రీలంకను వరుస పేలుళ్ల భయం వీడడం లేదు. మరిన్ని దాడులకు పాల్పడుతామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఓ కంటైనర్‌లో పేలుడు పదార్థాలను తరలించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో.. దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలను చేపట్టారు. వరుస పేలుళ్లకు పాల్పడే ముందు నేషనల్ తాహీద్ జమాత్ ఉగ్రవాద సంస్థకు చెందిన 8 మంది ఉగ్రవాదులు ప్రతిజ్ఞ చేసిన వీడియో వైరల్ అవుతోంది. న్యూజిల్యాండ్ క్రెస్ట్ చర్చిలో ముస్లింల ఊచకోత ప్రతీకారంగా తాము […]

పగ.. పగ.. తీర్చుకున్నాం.. చూస్తారా మా వీడియో..?: ఐసిస్
Follow us on

శ్రీలంకను వరుస పేలుళ్ల భయం వీడడం లేదు. మరిన్ని దాడులకు పాల్పడుతామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో హై అలర్ట్ కొనసాగుతోంది. ఓ కంటైనర్‌లో పేలుడు పదార్థాలను తరలించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో.. దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలను చేపట్టారు.

వరుస పేలుళ్లకు పాల్పడే ముందు నేషనల్ తాహీద్ జమాత్ ఉగ్రవాద సంస్థకు చెందిన 8 మంది ఉగ్రవాదులు ప్రతిజ్ఞ చేసిన వీడియో వైరల్ అవుతోంది. న్యూజిల్యాండ్ క్రెస్ట్ చర్చిలో ముస్లింల ఊచకోత ప్రతీకారంగా తాము చర్చిలపై దాడులకు పాల్పడుతామని వారు ప్రమాణం చేశారు. ఈ వీడియోలో సూసైడ్ బాంబర్లలో అబూ ఉబైదా ఒక్కడి ముఖం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్రీలంకలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన 8 మంది ఉగ్రవాదులు తమ దేశం వారేనని ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి. సూసైడ్ బాంబర్స్‌కు జహరీన్ హాషీం అలియాస్ అబూ ఉబైదా నేతృత్వం వహించాడని, ఎన్‌టీజే ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో నిరంతరం టచ్‌లో ఉందని శ్రీలంక నిఘా వర్గాలు ధృవీకరించాయి.

ఉగ్రదాడులపై నిఘా వర్గాలు హెచ్చరించినా.. అడ్డుకోవడంలో విఫలమయ్యామంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రజలను క్షమాపణలు కోరింది. 2009లో సివిల్ వార్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న అతిపెద్ద హింసాత్మక ఘటన ఇది.