
మన చుట్టు ఉండే వాతావరణం ఆహ్లదకంగా ఉంటే మనం ఆహ్లదంగా ఉంటాం. ఒకవేళ వాతావరణం కాలుష్యమైతే మనిషిపై అనారోగ్య ప్రభావాలు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే.. వాతావరణ కాలుష్యానికి, ఆత్మహత్యలకు లింక్ ఉందని ఓ సర్వే తేల్చి చెప్పింది. వాయు కాలుష్యం అనేక ఆరోగ్య వ్యాధులతో ముడిపడి ఉంది. చెడు గాలి నాణ్యతకు గురికావడం శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం, ఊపిరితిత్తుల మానసిక ఆరోగ్య పరిస్థితులకు గురవుతాం. అయితే వాయు కాలుష్య స్థాయిలు ఆత్మహత్య రేటుతో ముడిపడి ఉన్నాయని చైనాలో ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది.
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాల వల్ల దేశంలో 46,000 ఆత్మహత్య మరణాలను నివారించగలిగామని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాంటా బార్బరా పరిశోధకులు లెక్కించారు. అధ్యయనం కోసం ఓ బృందం కాలుష్యం, ఆత్మహత్య రేటును ప్రభావితం చేసే కారకాల పరిస్థితులపై పరిశోధన చేసింది. గాలి నాణ్యత మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక అంశంగా పనిచేస్తుందని వారు కనుగొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు నేచర్ సస్టెయినబిలిటీ జర్నల్ స్పష్టం చేసింది
చైనాలో మహిళలు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారని గతంలో జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. కాలుష్యం మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వృద్ధ మహిళలపై అనేక అనారోగ్య సమస్యలకు గురిచేస్తుందట. ఆత్మహత్య ప్రమాదంతో సహా దీర్ఘకాలిక ఆరోగ్య వ్యాధులకు దారితీసే నాడీ ప్రభావాలపై వాయు కాలుష్యం నేరుగా ప్రభావం చూపుతుందని సర్వేలో తేలింది. 2000 సంవత్సరంలో దేశంలో తలసరి ఆత్మహత్యల రేటు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉందని, కానీ రెండు దశాబ్దాల తర్వాత అది సగటు కంటే తక్కువకు పడిపోయిందని, ఇది కూడా తగ్గుతోందని పరిశోధకులు తెలిపారు.