ఆ శాస్త్రవేత్తను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో కాల్చి చంపారట, ఇరాన్ నిప్పులు కక్కుతోంది

|

Dec 07, 2020 | 4:24 PM

ఇరాన్‌కు చెందిన అణు శాస్త్ర‌వేత్త మోషెన్ ఫ‌క్రిజాదే ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫ‌క్రిజాదేను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో హ‌త్య చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

ఆ శాస్త్రవేత్తను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో కాల్చి చంపారట, ఇరాన్ నిప్పులు కక్కుతోంది
Follow us on

Mohsen Fakhrizadeh killed using satellite controlled gun: ఇరాన్‌కు చెందిన అణు శాస్త్ర‌వేత్త మోషెన్ ఫ‌క్రిజాదే ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఫ‌క్రిజాదేను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో హ‌త్య చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌కు చెందిన మెహ్ర్ న్యూస్ ఏజెన్సీ ఇందుకు సంబంధించి కొన్ని వివరాలు వెల్ల‌డించింది. ఫ‌క్రిజాదే మరణంపై చాలా వార్తలు వచ్చాయి. బాడీగార్డుల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఆయన చనిపోయాడని మొదట్లో కొన్ని ఛానెల్స్‌లో న్యూస్ వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన మరణానికి సంబంధించి మరో సంచలన విషయం బయటికి వచ్చింది. రిమోట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో ఫ‌క్రిజాదేను హ‌త్య చేశారని సమాచారం. చివరిక్షణాల్లో ఆయన పక్కన భార్య ఉన్నా ఆమెకు ఏమీ కాలేదు. కానీ ఫ‌క్రిజాదే బాడీలోకి మాత్రం13 బుల్లెట్లు దిగాయి. ఆ సమయంలో ఫ‌క్రిజాదే బాడీగార్డ్స్ 11 మంది వేర్వేరు వాహనాల్లో ఉన్నారట.

ఇరాన్ ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ అధినేతనే ఈ ఫ‌క్రిజాదే. అయితే ఇరాన్‌కు చెందిన న్యూక్లియ‌ర్ శాస్త్ర‌వేత్త‌ల‌ను ప‌దేళుగా ఇజ్రాయిల్‌ హ‌త‌మారుస్తోందనే ఆరోప‌ణ‌లున్నాయి. అమెరికా ప్రోద్బలంతోనే ఈ హత్యలు కొనసాగుతున్నాయని ఇరాన్ అంటోంది. ఈ ఏడాది జనవరిలో రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఖాసిం సులేమానీని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. తమ శాస్త్రవేత్తను హత్య చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటోంది ఇరాన్. తాము కచ్చితంగా ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ంటోంది. ఇరాన్‌కు సంబంధించిన కోవ‌ర్ట్ న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌లో ఫ‌క్రిజాదేకు ప్ర‌మేయం ఉన్న‌ట్లు సమాచారం. ఇరాన్ చేసిన ఆరోపణలపై ఇజ్రాయిల్ మాత్రం స్పందించలేదు.