Iran – Israel War: ఇజ్రాయెల్‌ టార్గెట్‌ మారింది.. ఫోర్డోలో అసలేం జరిగింది? పూర్తి వివరాలు

పౌరుల అవసరాల కోసం అణు విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఇరాన్‌కు సహకరించే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కార్యవర్గం పరిశీలిస్తోంది. దీనికింద టెహ్రాన్‌కు 30 బిలియన్‌ డాలర్ల సాయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది. టెహ్రాన్‌తో ఎలాగైనా టేబుల్‌ డీల్‌కు తీసుకువచ్చేలా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

Iran - Israel War: ఇజ్రాయెల్‌ టార్గెట్‌ మారింది.. ఫోర్డోలో అసలేం జరిగింది? పూర్తి వివరాలు
65

Updated on: Jun 27, 2025 | 10:06 PM

ఇజ్రాయెల్‌ ఏమాత్రం రెస్ట్‌ తీసుకోవడం లేదు. మూడేళ్లలో ఫస్ట్‌ టైమ్‌ తన దగ్గరున్న బంకర్‌ బస్టర్‌ బాంబులను వాడింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా టార్గెట్‌గా అటాక్స్‌ చేస్తోంది. తమ వైమానిక దళం లెబనాన్‌లోని పలు పర్వత ప్రాంతాల్లోని ఉగ్రవాద హెజ్‌బొల్లా గ్రూప్ సభ్యుల భూగర్భ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఈ దాడుల్లో పలువురు హెజ్‌బొల్లా కీలక నాయకులు చనిపోగా.. వారి స్థావరాలను సైతం ధ్వంసం చేసినట్లు చెబుతోంది. టెల్‌ అవీవ్‌ ప్రయోగించిన బంకర్‌ బస్టర్‌ బాంబుల వల్ల పలు ప్రాంతాలలోని భవనాలు దెబ్బతినగా.. అనేకమంది పాలస్తీనియన్లు గాయాలపాలైనట్లు లెబనాన్‌ ప్రకటించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గతేడాది నవంబరులో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు చేయడంతో.. ప్రతి చర్యగా ఇజ్రాయెల్‌ ఆర్మీ విరుచుకుపడింది. ఆ సంస్థకు చెందిన పలు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హమాస్‌ తన చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తుండగా, ప్రతిగా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్‌ విడుదల చేస్తోంది. అయితే గాజాపై దాడులను మాత్రం ఆపడంలేదు. గాజాలో తమ యుద్ధాన్ని ఆపడానికి ఎటువంటి మార్గం లేదని ఆ దేశ ప్రధాని నెతన్యాహు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి