Viral Video: డ్యాన్స్‌ చేశారని యువ జంటకు పదేళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు!

|

Feb 01, 2023 | 4:02 PM

బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్‌ చేసిన ఓ జంటకు కోర్టు మంగళవారం (జనవరి 31) పదేళ్ల జైలు శిక్ష విధించింది. అసలేంజరిగిందంటే..

Viral Video: డ్యాన్స్‌ చేశారని యువ జంటకు పదేళ్ల జైలు శిక్ష.. కోర్టు సంచలన తీర్పు!
Viral Video
Follow us on

బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్‌ చేసిన ఓ జంటకు ఇరాన్‌ ప్రభుత్వం మంగళవారం (జనవరి 31) పదేళ్ల జైలు శిక్ష విధించింది. అసలేంజరిగిందంటే.. అస్తియాజ్ హఘిఘీ అనే యువతి, ఆమెకు కాబోయే భర్త అమీర్ మొహమ్మద్ అహ్మదీ ఇరాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక స్థలమైన ఆజాదీ టవర్ వద్ద రోమాంటిక్‌ డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ డ్యాన్స్‌లో అహ్మదీ తనకు కాబోయే భార్యను చేతులతో ఎత్తుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతి హిజాబ్‌ ధరించలేదు. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ నియమావళిని ధిక్కరించిన నేరం కింద గత నవంబర్‌లో ఈ జంటను అరెస్ట్‌ చేశారు ఇరాన్‌ పోలీసులు. కాగా ఇరాన్‌లో గత కొంతకాలంగా హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హఘీ స్కార్ఫ్ లేకుండా బయటికి వెళ్లడమేకాకుండా, పురుషుడితో బహిరంగంగా డ్యాన్స్‌ చేయడం వంటివాటిని ఇరాన్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో ఈ జంటకు ఏకంగా పదేళ్ల ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించింది. అలాగే ఇంటర్నెట్‌ వినియోగం, దేశం విడిచి వెళ్లడంపై ఈ జంటకు నిషేధం విధించింది. బెయిల్‌పై విడుదల చేసేందుకు కూడా ఇరాన్‌ కోర్టు అంగీకరించలేదు. టెహ్రాన్‌లోని ఖార్చక్ మహిళా జైలులో ప్రస్తుతం హగీఘీ శిక్ష అనుభవిస్తోంది.

కాగా ఇస్లామిక్ డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించినందుకు అరెస్టయిన జినా మహ్సా అమిని అనే యువతి మృతి తర్వాత నెలల వ్యవధిలో ఇరాన్‌లో నిరసనలు మిన్నంటాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. నిరసనల్లో పాల్గొన్న 14,000 మందిని అరెస్టు చేసింది. పలువురు సెలబ్రిటీలు, జర్నలిస్టులు, లాయర్లను సైతం నిర్భందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.