
Russia Army Games 2022: ఒకవైపు ఉక్రెయిన్ మీద యుద్దాన్ని కొనసాగిస్తున్న రష్యా, మరోవైపు ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్ 2022కు ఆతిథ్యం ఇస్తోంది. ఆగస్టు 13వ తేదీన మాస్కో సమీపంలోని పేట్రియాట్ మిలిటరీ పార్క్‌లో ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ఆర్మీ వేడుకలు 27వ తేదీ వరకూ కొనసాగుతాయి. రష్యా ఆతిథ్యం ఇస్తున్న ఈ ఆర్మీ గేమ్స్‌ను చైనాలోనూ కొనసాగిస్తున్నారు.. మిలిటరీ ఒలింపిక్స్గా పిలిచే ఈ ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్‌లో రష్యా, చైనా, ఇరాన్, బెలారస్, వెనిజులా, ఉజ్బెకిస్తాన్, అల్జీరియా సహా 12 దేశాలు పాల్గొంటున్నాయి. 270 జట్లు వివిధ విభాగాల్ల పోటీ పడుతున్నాయి.. ఈ గేమ్స్ అన్నీ యుద్ధ విన్యాసాల రూపంలో కొనసాగడం ఇక్కడ చూడవచ్చు.
ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్‌లో వివిధ దేశాల సైనికుల మధ్య షూటింగ్. డ్రైవింగ్, కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు.. యుద్ధంలో ట్యాంకులతో దూసుకుపోవడం, నిర్ణీత వ్యవధిలో లక్ష్యాన్ని ఛేదించడంలో వీరంతా పోటీ పడుతున్నారు.. అత్యాధునిక ట్యాంకర్లు, ఆయుధాలను ఉపయోగిస్తూ నిర్వహిస్తున్న ఈ క్రీడలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.
ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్‌ను తొలిసారిగా రష్యా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ 2013లో ప్రారంభించింది. 2014లో చైనా సైన్యాన్ని కూడా పాల్గొనడానికి ఆహ్వానించింది.. ఆ తర్వాత ఇతర దేశాలను కూడా ఇందులో పాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నారు. అత్యాధునిక వాహనాలు, ఆయుధాలను వినియోగించడం, శిక్షణ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడవంతో పాటు, వివిధ దేశాల మధ్య స్నేహబంధాన్ని ధృడోపేతం చేసుకోడానికి ఈ గేమ్స్ ఉపయోగపడతాయని చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..