ఇండోనేషియా రాజధాని జకార్తా కాదు.. ఇకపై కాళీమంథన్

| Edited By:

Aug 18, 2019 | 1:53 PM

నిత్యం ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే దేశం ఇండోనేషియా. తరచూ ఏదో ఒక రూపంలో ఇక్కడ విధ్వంసం జరుగుతూనే ఉంటుంది.  దీనిపై ఆదేశాధ్యక్షుడు జోకో విడొడో సంచలన ప్రకటన చేశారు. దేశంలో భూకంపాలు, సునామీలు తరచుగా వస్తుండటం, పలు అగ్ని పర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటి నుంచి బయటపడేందుకు దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలో ఉన్న కాళీమంథన్ నగరానికి మార్చనున్నట్టు ఆయన సంచలన ప్రకటన చేశారు. విడోడో, జకార్తాపై […]

ఇండోనేషియా రాజధాని జకార్తా కాదు.. ఇకపై కాళీమంథన్
Follow us on

నిత్యం ప్రకృతి విపత్తులతో అల్లాడిపోయే దేశం ఇండోనేషియా. తరచూ ఏదో ఒక రూపంలో ఇక్కడ విధ్వంసం జరుగుతూనే ఉంటుంది.  దీనిపై ఆదేశాధ్యక్షుడు జోకో విడొడో సంచలన ప్రకటన చేశారు. దేశంలో భూకంపాలు, సునామీలు తరచుగా వస్తుండటం, పలు అగ్ని పర్వతాలు పేలడానికి సిద్ధంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వీటి నుంచి బయటపడేందుకు దేశ రాజధానిని జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలో ఉన్న కాళీమంథన్ నగరానికి మార్చనున్నట్టు ఆయన సంచలన ప్రకటన చేశారు.

విడోడో, జకార్తాపై ప్రకృతి విపత్తుల ప్రభావం అధికంగా ఉండటంతో రాజధానిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్లమెంట్ లో ప్రకటించారు దేశాధ్యక్షుడు జోకో విడోడో. ప్రతి ఏడాది జకార్తా నగరం 25 సెంటీమీటర్ల చొప్పున సముద్రంలో మునిగిపోతుందని, ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి నగరంలో మూడింట ఒక వంతు నీటి పాలవుతుందని జోకో హెచ్చరించారు. దేశ రాజధానిని బోర్నియో ద్వీపంలోని కాళీమంథన్ కు తరలించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్టుగా ఆయన తెలిపారు.