Singapore MBS: సింగపూర్‌ స్టార్‌ హోటల్‌లో భారతీయుడి రచ్చ.. టాయిలెట్‌ కనిపించలేదనీ ఎంట్రెన్స్‌లోనే పనికానిచ్చాడు!

|

Sep 20, 2024 | 11:41 AM

సింగపూర్‌లో పనిచేస్తున్న ఓ భారత కార్మికుడు స్టార్ హోటల్‌లో మలవిసర్జన చేసిన కేసులో అరెస్ట్‌ అయ్యాడు. సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ (MBS)కి గతేడాది క్యాసినో కోసం వెళ్లి ఓ వ్యక్తి మద్యం మత్తులో హోటల్‌ ఎంట్రెన్స్‌లోనే నేలపై మలవిసర్జన చేశాడు. నిందితుడిని రాము చిన్నరసగా..

Singapore MBS: సింగపూర్‌ స్టార్‌ హోటల్‌లో భారతీయుడి రచ్చ.. టాయిలెట్‌ కనిపించలేదనీ ఎంట్రెన్స్‌లోనే పనికానిచ్చాడు!
Singapore MBS
Follow us on

సింగపూర్‌లో పనిచేస్తున్న ఓ భారత కార్మికుడు స్టార్ హోటల్‌లో మలవిసర్జన చేసిన కేసులో అరెస్ట్‌ అయ్యాడు. సింగపూర్‌లోని మెరీనా బే సాండ్స్ (MBS)కి గతేడాది క్యాసినో కోసం వెళ్లి ఓ వ్యక్తి మద్యం మత్తులో హోటల్‌ ఎంట్రెన్స్‌లోనే నేలపై మలవిసర్జన చేశాడు. నిందితుడిని రాము చిన్నరసగా గుర్తించారు. అక్కడి చట్టాల ప్రకారం ప్రజారోగ్య (పబ్లిక్ క్లీన్సింగ్) నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశంలో మలవిసర్జన చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ వ్యవహారాన్ని విచారించిన కోర్టు ఈ కేసులో అతడిని దోషిగా తేల్చింది. 400 సింగపూర్‌ డాలర్లు (మన కరెన్నీలో రూ.25 వేలు) జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. అసలేం జరిగిందంటే..

వర్క్ పర్మిట్‌పై సింగపూర్‌లో ఉన్న భారతీయ వ్యక్తి రాము (37) 2023 అక్టోబర్ 30న క్యాసినో ఆడేందుకు ప్రముఖ ‘మెరీనా బే సాండ్స్‌’ రిసార్ట్స్‌ అండ్‌ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ 3 బాటిల్స్‌ హార్డ్ లిక్కర్‌ తాగాడు. మద్యం మత్తు తలకెక్కడంతో మరుసటి రోజు ఉదయం 5.20 గంటల సమయంలో క్యాసినో నుంచి బయటకు వచ్చాడు. టాయిలెట్‌కు వెళ్లాలను కున్నాడు. కానీ మద్యం మత్తులో ఆ హోటల్‌లో టాయిలెట్‌ ఎక్కడుంటే గుర్తించలేకపోయిన రాము.. హోటల్‌ మొదటి ఫ్లోర్‌ ఎంట్రన్స్‌ వద్ద, రెస్టారెంట్ పక్కన నేలపై మలవిసర్జన చేశాడు. అనంతరం ఎమ్‌బీఎస్‌ నుంచి నేరుగా బయటికి వెళ్లిపోయాడు.

అనంతరం గమనించిన భద్రతా సిబ్బంది.. సీసీటీవీల్లో అతడిని గుర్తించి ప్రజారోగ్య నిబంధనల కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో అప్పట్లో వైరల్‌గా మారింది. తాజాగా జూన్‌ 4వ తేదీన క్యాసినో కోసం రాము మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. వెంటనే గుర్తించిన సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణలో రాము తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని మందలించిన జడ్జి 400 సింగపూర్‌ డాలర్లు జరిమానాగా విధించారు. జరిమానా చెల్లించకపోతే, రెండు రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెల్లడించారు. అయినా నిందితుడు తీరు మార్చుకోకపోతే రోజుకి1,000 సింగపూర్‌ డాలర్ల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.