105 నిమిషాల్లో 36 పుస్తకాలు చదివి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన భారత సంతతి నాలుగేళ్ల బాలిక

|

Apr 11, 2021 | 10:18 PM

యూఏఈలో భారత సంతతికి చెందిన బేబీ కియారా అనే నాలుగు సంవత్సరాల బాలిక సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 105 నిమిషాల్లో 36 పుస్తకాలను చదివి వరల్డ్‌ బుక్‌ ..

105 నిమిషాల్లో 36 పుస్తకాలు చదివి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సాధించిన భారత సంతతి నాలుగేళ్ల బాలిక
Indian American
Follow us on

యూఏఈలో భారత సంతతికి చెందిన బేబీ కియారా అనే నాలుగు సంవత్సరాల బాలిక సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 105 నిమిషాల్లో 36 పుస్తకాలను చదివి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అతి తక్కువ సమయంలో అనేక పుస్తకాలు చదివి అనేక పుస్తకాలు చదివి కొత్త రికార్డు సృష్టించిందంటూ ది ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అంగీకరించింది. తనకు పుస్తకాల్లో ఉన్న కలర్‌ఫుల్‌ బొమ్మలను చూడడమంటే చాలా ఇష్టమని, అందుకనే పుస్తకాలను చదివేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటానని బేబీ కియారా చెబుతోంది. డాక్టర్‌ కావడం తన లక్ష్యమని తెలిపింది. అయితే గడిచిన ఏడాది కాలంలో బేబీ కియారా దాదాపు 200 పుస్తకాలు చదివినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. బేబీ కియారా ఇంట్లోనే కాకుండా బయటకు వెళ్లిన సమయంలోనూ చేతి పుస్తకం తప్పకుండా ఉంటుందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఇంత చిన్న వయసులోనే తమ కూతురు కొత్త రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కాగా, బేబీ కియారా తల్లిదండ్రుల స్వస్థలం చెన్నై. వారిద్దరూ అమెరికాలో ఉన్న సమమంలో బేబీ కియారా జన్మించింది. ఆనంతరం తల్లిదండ్రులు కూతురితో కలిసి అబుదాబికి షిప్ట్‌ అయిపోయారు. అయితే ఇంత చిన్న వయసులో వరల్డ్‌ బుక్‌ రికార్డు సాధించడంపై ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఆనందంతో పొంగిపోతున్నారు.

ఇవీ చదవండి: Mars helicopter flight : అంగారక గ్రహంపై బుల్లి హెలికాప్టర్‌ నేడు ఎగరలేదు, వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎందుకంటే..

బొమ్మను ‘పెళ్లి’ చేసుకున్న బాడీ బిల్డర్, ఇప్పుడు విడాకులు ఇచ్చేశాడు.. ఇదో విచిత్ర స్టోరి….