NASA: అమెరికాలో కీలక బాధ్యత స్వీకరించిన మరో భారత సంతతి మహిళా.. అమెరికా అంతరిక్ష సంస్థలో..

|

Feb 02, 2021 | 5:15 AM

ndian-American Appointed As: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాలో అత్యున్నత పదవులను అధిరోహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు...

NASA: అమెరికాలో కీలక బాధ్యత స్వీకరించిన మరో భారత సంతతి మహిళా.. అమెరికా అంతరిక్ష సంస్థలో..
Follow us on

Indian-American Appointed As: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాలో అత్యున్నత పదవులను అధిరోహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో భారత సంతంతికి చెందిన వారి ప్రాముఖ్యత పెరుగుతోంది.
ఈ క్రమంలోనే ఇప్పటికే భారతీయులు పలు కీలక పదవులను చేపట్టారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలో మరో భారతసంతతికి చెందిన మహిళ వచ్చి చేరారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ యాక్టింగ్ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా భారత సంతతికి చెందిన భవ్యలాల్‌ సోమవారం నియమితులయ్యారు. నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్ర పోషించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ అనాలసిస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీలో 2005 నుంచి 2020 వరకు భవ్యా సభ్యురాలిగా విధులు నిర్వర్తించారు.

Also Read: మయన్మార్ లో అధికారాన్ని చేజిక్కించుకున్న సైనిక ప్రభుత్వం, ప్రజానేత ఆంగ్ సాన్ సూకీ నిర్బంధం