దుబాయి చేరుకున్న భారత ఉత్పాదక వ్యాక్సిన్ కోవిషీల్డ్.. భారతీయులకు మాత్రం టీకా ఆంక్షలు..

భారత దేశీయ ఉత్పాదక వ్యాక్సిన్ మంగళవారం దుబాయి చేరుకుంది. సీరం సంస్ధ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకున్నట్లుగా దుబాయి పేర్కొంది. దుబాయిలో ఇప్పటికే ఫైజర్, సినోఫాం అనే రెండు రకాల...

దుబాయి చేరుకున్న భారత ఉత్పాదక వ్యాక్సిన్ కోవిషీల్డ్.. భారతీయులకు మాత్రం టీకా ఆంక్షలు..

Updated on: Feb 03, 2021 | 5:18 PM

India-made Covid-19 Vaccines : భారత దేశీయ ఉత్పాదక వ్యాక్సిన్ మంగళవారం దుబాయి చేరుకుంది. సీరం సంస్ధ ఉత్పత్తి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకున్నట్లుగా దుబాయి పేర్కొంది. దుబాయిలో ఇప్పటికే ఫైజర్, సినోఫాం అనే రెండు రకాల వ్యాక్సిన్లు తెప్పించుకుంది ఇప్పుడు అదనంగా మూడో వ్యాక్సిన్ ఆస్ట్రా జెనెకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే… యూఏఈలో మరింత భారతీయతనం కొరకు దుబాయి భారతీయ వ్యాక్సిన్ వినియోగానికి అనుమంతిచినట్లుగా అబుధాబిలోని భారతీయ ఎంబసీ పేర్కొంది. ఇదిలా ఉండగా 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కల్గిన స్ధానిక పౌరులైన భారతీయులకు వ్యాక్సిన్ అందిస్తామని దుబాయి ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కానీ, విదేశీయులు అంటే భారతీయులతో సహా ఇతర విదేశీయులకు మాత్రం ఆరోగ్య పరిస్థితుల ప్రతిపాదికన టీకా వేస్తామని తెలిపింది. కీలక గల్ఫ్ దేశాలన్నింటిలోనూ అమెరికా, చైనా దేశాలకు చెందిన వ్యాక్సిన్లు వాడుకలో ఉన్నాయి. కానీ వ్యాక్సిన్ మైత్రి అనే దౌత్య విధానంలో భాగంగా అరబ్ దేశాలకు వ్యాక్సిన్‌ను భారతదేశం ఎగుమతి చేస్తుంది. బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఈజిప్టు, అల్జీరియా దేశాలకు ఇప్పటికే భారతీయ వ్యాక్సిన్‌ను కేంద్రం సరఫరా చేసింది. కీలకమైన సౌదీ అరేబియాకు కూడా వాణిజ్యపరంగా ఎగుమతి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..