Variety Marriage: వింత ఆచారం.. నిలువు దోపిడీకి రెడీ అయితేనే నవ వధువును కలుసుకునే భాగ్యం

|

Nov 01, 2023 | 5:46 PM

పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులకు, వారి మనసులకు సంబంధించిన విషయం. మనవైపు జరిగే పెళ్లిళ్లలో వధూవరులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వింత ఆచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. వధువును కలవాలనుకుంటే వరుడికి అగ్నిపరీక్ష తప్పదు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగింపులో వింత పరిస్థితి చోటు చేసుకుంది. తమకు సిగరెట్లు, డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వధూవును చూసేందుకు పెళ్ళికొడుకును అడ్డుకున్నారు గ్రామస్తులు. చివరకు ఏమైందో చూద్దాం.

Variety Marriage: వింత ఆచారం.. నిలువు దోపిడీకి రెడీ అయితేనే నవ వధువును కలుసుకునే భాగ్యం
In China, A Strange Custom Has Come To Light For The Groom To See The Bride, He Has To Give Money Or No Wife
Follow us on

పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులకు, వారి మనసులకు సంబంధించిన విషయం. మనవైపు జరిగే పెళ్లిళ్లలో వధూవరులకు బహుమతులు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వింత ఆచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. వధువును కలవాలనుకుంటే వరుడికి అగ్నిపరీక్ష తప్పదు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగింపులో వింత ఆచారం ఉంది. తమకు సిగరెట్లు, డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వధూవును చూడకుండా పెళ్ళికొడుకును అడ్డుకున్నారు గ్రామస్తులు. చివరకు ఏమైందో ఇప్పుడు చూద్దాం.

వధువును చూసేందుకు వింత ఆచారం

చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌలోని ఒక గ్రామంలో వరుడికి చేదు అనుభవం ఎదురైంది. వధువును కలుసుకునేందుకు వెళ్లే క్రమంలో గ్రామస్తులందరూ తన పెళ్లి కారును అడ్డుకున్నారు. ఈ ఘటన అక్టోబర్ 20న చోటు చేసుకుంది. అక్కడి పరిస్థితులను ఒకరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఒక కథనాన్ని వెలువరించింది. చైనాలో నేటకీ కొనసాగుతున్న వివాదాస్పద వివాహ ఆచారాలు కొత్త చర్చకు దారి తీస్తోంది. ఇద్దరు కలిసి జీవనం సాగించేందుకు చుట్టుపక్కల వాళ్ల హడావిడి కనిపించింది. వీరందరూ వరుడి నుంచి డబ్బులు, సిగరెట్లను డిమాండ్ చేశారు. ఆతను ఇవ్వలేని పక్షంలో వధువును కలిసేందుకు నిరాకరించారు. అందులో ఎక్కువ భాగం వృద్దులే ఉండటం గమనార్హం.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన నివేదిక

స్థానిక సంప్రదాయంలో భాగంగా, వరుడి కుటుంబం అక్కడి వృద్ధ గ్రామస్తుల అభ్యర్థనలను నెరవేర్చడం ఆచారం. ఇది పంచదార లేదా సిగరెట్‌లను అందించడం నుండి ఎరుపు ఎన్వలప్‌లను సమర్పించడం వరకు వెళ్లింది. అంటే డబ్బులు డిమాండ్ చేయడం అన్నమాట. అక్కడి సాంప్రదాయం ప్రకారం గ్రామస్తులను సంతృప్తి పరచడంలో విఫలమైతే, వరుడు తన వధువును కలుసుకోవడంలో జాప్యాన్ని ఎదుర్కోవచ్చు. ఒకానొక సందర్భంలో పూర్తిగా పెళ్లినే నిరాకరించే అవకాశాలు ఉన్నాయి. వరుడి మార్గాన్ని అడ్డుకునే ఈ పద్ధతిని మాండరిన్‌లో లాన్ మెన్ అని పిలుస్తారు. దీని అర్థం “తలుపును అడ్డుకోవడం” అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన నివేదిక పేర్కొంది. వరుడు తన ప్రియమైన వారిని వివాహం చేసుకోవాలనేందుకు ఏమేర సిద్దంగా ఉన్నాడో పరీక్షించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఈ పద్దతి కాస్త తప్పుదోవపట్టి డబ్బులు డిమాండ్ చేసేలా దారితీసింది.

ఇవి కూడా చదవండి

సాంప్రదాయం పేరుతో దురాచారం..

ఇతర వినూత్న మార్గాలలో వధువు కుటుంబసభ్యులు. స్నేహితులు వరుడిని ఆటపట్టించడం కోసం పద్యాల చెప్పమని అడగడం, పాటలు పాడమనడంతోపాటూ నృత్య నైపుణ్యాలను ప్రదర్శించడం లాంటివి ఉంటాయి. కానీ అలా జరుగకుండా.. “అక్కడ ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే, వరుడి కుటుంబం ప్రతి ఎరుపు ప్యాకెట్‌లో ఒక యువాన్ అంటే (14 US సెంట్లు) వేస్తారు. చాలా మంది లేకుంటే ప్రజలే వారి ఎరుపు రంగు ప్యాకెట్‌లో 10 యువాన్‌లు వేస్తారు.” ఇది దుర్మార్గపు ఆచారం అంటూ పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులను దోచుకునే దురాచారానికి తెరలేపిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. దీనికి కొందరు మద్దతు పలుకగా మరి కొందరు వ్యతిరేకించారు. ఒకరి వైపు ఎక్కువ మంది లేకుంటే మరొకరికి నష్టం. చైనాలోని ఇతర వివాదాస్పద వివాహ ఆచారాలలో వధువు సంప్రదాయ వివాహ దుస్తులను ధరించి, వరుడిని కలిసే ముందు చాలా గంటలపాటు చెప్పులు లేకుండా కూర్చొని వారి ప్రమాణాలు చేస్తారు. దీనిని ఆగ్నేయ జియాంగ్జీ ప్రావిన్స్‌లో కొన్ని కుటుంబాలు అనుసరిస్తున్నాయి.