Girl Business: పదేళ్ల పాప.. నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔట్ అవ్వాల్సిందే..!

|

Dec 09, 2021 | 9:57 AM

Girl Business: సాధారణంగా తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. డాక్టర్‌గానో, పోలీస్ గానో.. మరేదో ఉన్న ఉద్యోగంలో చూడాలని ఆకాంక్షిస్తారు.

Girl Business: పదేళ్ల పాప.. నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది.. మ్యాటర్ తెలిస్తే ఫ్యూజులు ఔట్ అవ్వాల్సిందే..!
Girl
Follow us on

Girl Business: సాధారణంగా తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు. డాక్టర్‌గానో, పోలీస్ గానో.. మరేదో ఉన్న ఉద్యోగంలో చూడాలని ఆకాంక్షిస్తారు. అయితే, వ్యాపారవేత్తలు కావాలని మాత్రం అస్సలు భావించరు. ఏదో ఒకటి చదివి… ఏదో ఒక మంచి ఉద్యోగం, గొప్పగా సంపాదించాలని భావిస్తారు. కానీ 42 ఏళ్ల రాక్సీ జాసెంకో అనే మహిళ మాత్రం అలా అనుకోలేదు. తన కూతురు వ్యాపారవేత్త కావాలని కలలుకంది. దానికి తగ్గట్టే ఆ పాప కూడా అలాంటి ఆలోచనలతోనే పెరిగింది. పదేళ్లకే అతిపెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదిగింది. కోట్లలో సంపాదిస్తూ సిడ్నీలో సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ చేస్తోంది.

ఆ చిన్నారి పేరు పిక్సీ కర్టిస్.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ చేస్తోంది. తన కూతుర్ని ఓ వ్యాపారవేత్తగా చూడాలి అనుకున్న తల్లి రాక్సీ జాసెంకో కూతురు పుట్టగానే ఆమె పేరు మీద 2011లో పిక్సీస్ బౌస్ అనే వ్యాపారం ప్రారంభించింది. ఆ తర్వాత పిక్సీస్ ఫిడ్‌జెట్స్ అనే మరో వ్యాపారం కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఇవి విజయవంతంగా సాగుతున్నాయి. పిల్లల బొమ్మలు, పిల్లలకు అవసరమయ్యే స్టేషనరీ, సరదా గాడ్జెట్స్ వంటివి అమ్ముతుంది. కొత్తగా వచ్చే బొమ్మలకు రివ్యూ ఇస్తుంది. అవి ఎలా వాడాలో, వాటి ధర ఎంతో, ఏ వయసు వారికి బాగుంటాయో చెబుతుంది. ఇలా చిన్నప్పటి నుంచే వ్యాపారంలో కిటుకులు తెలుసుకున్న పిక్సీ ఇప్పుడు నెలకు రెండు వ్యాపారాల ద్వారా కోటి రూపాయల దాకా సంపాదిస్తోంది.

పిక్సీకి ఇన్‌స్టా‌గ్రామ్‌ అకౌంట్ ఉంది. దానికి 90వేల మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. నాలుగేళ్ల కిందట.. ఆరేళ్ల వయసప్పుడే ఈ చిన్నారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సరింగ్ యాడ్ కోసం నాలుగున్నర లక్షలు తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఆస్ట్రేలియా నుంచి ఓ పవర్‌ఫుల్ బిజినెస్ ఉమన్‌గా పిక్సీ ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అందరూ అనుకుంటున్నారు.

Also read:

 Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..