బిన్ లాడెన్ అమరవీరుడట.. కీర్తించిన ఇమ్రాన్ ఖాన్

| Edited By:

Jun 25, 2020 | 10:34 PM

ఉగ్రవాదాన్ని పెంచి పోషించి, ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న అల్‌ ఖైదా మాజీ నేత ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడట. ఈ విషయం ఎవరో అన్నది కాదు పాకిస్తాన్ ప్రధాని నోటి నుంచి వచ్చిన మాట. ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఇమ్రాన్ ఖాన్ ఈ మాటలు అన్నాడు. లాడెన్‌ని హతమార్చడం మొదలు అమెరికా, తమ దేశాన్ని ఎన్ని విషయాల్లో ఇబ్బందులు పెట్టిందో చెప్పుకొచ్చాడు ఇమ్రాన్. ఈ నేపథ్యంలో అబ్బొటాబాద్‌కి వచ్చిన అమెరికన్లు లాడెన్‌ని చంపేశారు. […]

బిన్ లాడెన్ అమరవీరుడట.. కీర్తించిన ఇమ్రాన్ ఖాన్
Follow us on

ఉగ్రవాదాన్ని పెంచి పోషించి, ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న అల్‌ ఖైదా మాజీ నేత ఒసామా బిన్ లాడెన్ అమరవీరుడట. ఈ విషయం ఎవరో అన్నది కాదు పాకిస్తాన్ ప్రధాని నోటి నుంచి వచ్చిన మాట. ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ఇమ్రాన్ ఖాన్ ఈ మాటలు అన్నాడు. లాడెన్‌ని హతమార్చడం మొదలు అమెరికా, తమ దేశాన్ని ఎన్ని విషయాల్లో ఇబ్బందులు పెట్టిందో చెప్పుకొచ్చాడు ఇమ్రాన్. ఈ నేపథ్యంలో అబ్బొటాబాద్‌కి వచ్చిన అమెరికన్లు లాడెన్‌ని చంపేశారు. అతడొక అమరవీరుడు అని అన్నాడు.

ఇక ఆ వీడియో కాస్త వైరల్‌గా మారగా.. సొంత దేశంలో కూడా ఇమ్రాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాడెన్‌ని అమరవీరుడు అని చెప్పడం ఇమ్రాన్ తెలివి తక్కువ తనానికి నిదర్శనమని మాజీ విదేశాంగ మంత్రి ఖవాజా అసిఫ్ అన్నారు. ఉగ్రవాదం పేరిట ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. పాక్ ప్రతిష్టను ఇమ్రాన్ ఖాన్ మరింత దిగజారుస్తున్నారని మీనా గబ్బేనా అనే సామాజిక కార్యకర్త ట్వీట్ చేశారు. అంతేకాదు ఉగ్రవాదులకు, పాక్‌కు ఉన్న సంబంధం ఏంటో మరోసారి బయటపడిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ప్రపంచంలోని అతి ఘోర మారణహోమాల్లో ఒకటైన 9/11కు బిన్ లాడెన్ కారకుడు. 2001లో అతడి ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా చెందిన ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చారు. అందులో 3 వేల మంది చనిపోగా.. 25వేలకు పైగా గాయపడ్డారు. దీంతో అమెరికా ఉలిక్కిపడగా.. ప్రపంచం కూడా వణికిపోయింది. దీంతో లాడెన్‌ని చంపాలని శపథం చేసుకున్న అమెరికా.. కొన్ని సంవత్సరాల పాటు ట్రేస్ చేసి మరి చంపిన విషయం తెలిసిందే.

Read This Story Also: అర్ధనగ్నంగా.. పిల్లలతో శరీరంపై పెయింటింగ్.. సామాజిక కార్యకర్తపై కేసు