20 నిమిషాలకే తుక్కుతుక్కు అయిన రెండు కోట్ల కొత్త కారు
రెండు మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది.. కొత్త కారును షో రూమ్‌ను తీసుకొస్తూ ముందున్న కాంపౌడ్‌వాల్‌కు బలంగా గుద్దుకున్న వీడియో అది! 30 లక్షలు పెట్టి కొన్న ఆ కారును..

రెండు మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది.. కొత్త కారును షో రూమ్ నుంచి తీసుకొస్తూ ముందున్న కాంపౌడ్‌వాల్‌కు బలంగా గుద్దుకున్న వీడియో అది! 30 లక్షలు పెట్టి కొన్న ఆ కారును నిర్లక్ష్యంగా నడిపేశారు.. కారుకు కొంచెం డామేజ్ అయ్యింది అంతే! దీనికే అంతగా బాధపడిపోతే మరి రెండు కోట్లు పోసి కొన్ని కారు కళ్ల ముందే తుక్కుతుక్కు అయితే అతగాడు ఎంత బాధపడి ఉండాలి? ఈ ఇన్సిడెంట్ బ్రిటన్‌లోని వేక్‌ఫీల్డ్‌లో జరిగింది.
సుమారు రెండు కోట్ల రూపాయల విలువైన లబోర్గిని హరికేన్ స్పైడర్ మోడల్ కారును కొనేసుకుని షో రూమ్ నుంచి బయటకొచ్చాడు.. కారును కొంత దూరం నడిపించాడు.. అంతలోనే చిన్న సాంకేతిక లోపం తలెత్తి కారు నడిరోడ్డుమీద ఆగింది.. ఏమైందా అని దిగి చూశాడు.. కారును పక్కకు తీసేలోపుగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.. ఫలితంగా కారు మొత్తం డ్యామేజ్ అయ్యింది.. కొని అరగంట కూడా కాలేదు.. అంతలోనే ఇంతటి వైపరీత్యామా అంటూ తెగ కుమిలిపోయాడా వ్యక్తి… ఏడ్చుకుంటూనే పోలీసులకు కంప్లయింట్ చేశాడు.. పోలీసులు మాత్రం తిన్నగా ఉండక ప్రమాదానికి గురైన ఆ కారు ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు.. నెటిజన్లు ఊరికే ఉండరు కదా! కారు యజమానిపై విపరీతమైన జాలి కురిపిస్తున్నారు..
