అమెరికాకు హ్యాకర్ల సెగ.. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌పై సైబ‌ర్ నేర‌గాళ్లు భారీగా మాల్‌వేర్‌తో దాడులు..!

|

Dec 15, 2020 | 7:12 AM

అగ్ర‌రాజ్యం అమెరికాకు హ్యాక‌ర్ల సెగ త‌గిలింది. ప్ర‌భుత్వానికి చెందిన ప‌లు కీల‌క విభాగాల స‌మాచారాన్ని హ్యాక‌ర్లు కాజేసిట్లు స‌మాచారం. అయితే దేశంలోని వివిధ శాఖ‌ల‌పై సైబ‌ర్ నేర‌గాళ్లు భారీగా మాల్‌వేర్‌తో ...

అమెరికాకు హ్యాకర్ల సెగ.. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌పై సైబ‌ర్ నేర‌గాళ్లు భారీగా మాల్‌వేర్‌తో దాడులు..!
Follow us on

అగ్ర‌రాజ్యం అమెరికాకు హ్యాక‌ర్ల సెగ త‌గిలింది. ప్ర‌భుత్వానికి చెందిన ప‌లు కీల‌క విభాగాల స‌మాచారాన్ని హ్యాక‌ర్లు కాజేసిట్లు స‌మాచారం. అయితే దేశంలోని వివిధ శాఖ‌ల‌పై సైబ‌ర్ నేర‌గాళ్లు భారీగా మాల్‌వేర్‌తో దాడులు చేసి ఉండ‌వ‌చ్చ‌ని అమెరికా ప్ర‌భుత్వం అనుమానిస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు అందించేందుకు అధికారులు నిరాక‌రిచారు. ఇలా హ్యాకింగ్ అయిన విష‌యం నిజ‌మేన‌ని కొంద‌రు అధికారులు చెబుతున్నారు. ఈ హ్యాకింగ్ వెనుక ఏ దేశ‌మైనా హ‌స్తం ఉందా…? అనే కోణంలో కూడా ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు అక్క‌డి అధికారులు. ప్ర‌ధానంగా ర‌ష్యా హ‌స్తం ఉందేమోన‌న్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అమెరికా ట్రెజర‌‌రీ విభాగంతో పాటు ఇంట‌ర్నెట్‌, టెలీక‌మ్యూనికేష‌న్ పాల‌సీలు నిర్ణ‌యించే శాఖ‌ల స‌మాచారం మొత్తం హ్యాకింగ్‌కు గురైన‌ట్లు తెలుస్తోంది.

అగ్ర‌రాజ్యంలో ఎంతో కీల‌క‌మైన ట్రెజ‌ర‌రీ విభాగం, వాణిజ్య శాఖకు చెందిన నేష‌న‌ల్ టెలీక‌మ్యూనికేష‌న్స్ అండ్ ఇన్ఫర్మేష‌న్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగాల‌ను హ్యాక‌ర్లు హ్యాక్ చేసిన‌ట్లు కొంద‌రు అధికారులు చెబుతున్నారు.

హ్యాకింగ్ దాడి వెనుక రాష్యా ఉందా..?
కాగా, ఈ హ్యాకింగ్ దాడి వెనుక ర‌ష్యా ఉన్న‌ట్లు అమెరిక‌న్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవ‌ల అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సైబ‌ర్ సెక్యూరిటీ సంస్థ ఫైర్ ఐ హ్యాకింగ్‌, ప్ర‌స్తుతం హ్యాకింగ్ ఘ‌ట‌న దాడికి సంబంధం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ హ్యాకింగ్ దాడి వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని నివారించేందుకు అత్య‌వ‌స‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అమెరికా జాతీయ‌సెక్యూరిటీ కౌన్సిల్ ప్ర‌తినిధి జాన్ ఉలియ‌ట్ పేర్కొన్నారు. దీనిపై వైట్ హౌస్‌లో స‌మావేశం ఏర్పాటు చేసి చ‌ర్చించాల్సి ఉంటుందని తెలుస్తోంది.