Ayodhya: రామనామ స్మరణతో మారుమ్రోగిన హ్యూస్టన్‌.. జై శ్రీరామ్ సాంగ్ కు టెస్లా కార్ల లైట్ షో

|

Jan 21, 2024 | 1:00 PM

100 మంది టెస్లా కార్ల యజమానులు రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలిజేశారు. శుక్రవారం సాయంత్రం శ్రీ గురువాయూరప్పన్ కృష్ణ దేవాలయంలో లైట్ షో కోసం సమావేశమయ్యారు. చుట్టుపక్కల ఉన్న వందలాది మంది రామభక్తులు, స్థానికులను ఈ లైట్ షో ఆకర్షించింది.

Ayodhya: రామనామ స్మరణతో మారుమ్రోగిన హ్యూస్టన్‌.. జై శ్రీరామ్ సాంగ్ కు టెస్లా కార్ల లైట్ షో
Jai Sri Ram
Follow us on

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దేశ విదేశాల్లోని రామ చంద్ర ప్రభు భక్తులు రకరకాలుగా పూజలను చేస్తున్నారు. జగమంతా రామ నామ స్మరణతో నిండిపోయింది. ప్రపంచంలో నలు మూలాల ఉన్న హిందువులు రామయ్య నామాన్ని జపిస్తూ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్‌లో రాములోరి భక్తులు వినూత్న రితీతిలో తమ భక్తిని మందిర ప్రారంభోత్సం పట్ల సంతోషాన్ని ప్రదర్సించారు. టెస్లా కార్ లైట్ షోను ఏర్పాటు చేశారు.

100 మంది టెస్లా కార్ల యజమానులు రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలిజేశారు. శుక్రవారం సాయంత్రం శ్రీ గురువాయూరప్పన్ కృష్ణ దేవాలయంలో లైట్ షో కోసం సమావేశమయ్యారు. చుట్టుపక్కల ఉన్న వందలాది మంది రామభక్తులు, స్థానికులను ఈ లైట్ షో ఆకర్షించింది. వంద కార్లు  పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఉన్నాయి. అప్పుడు కొందరు ఉద్యోగులు కూడా ఆ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నారు. జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ అనే సాంగ్ ప్లే అవుతుండగా.. కార్ల నుంచి బీట్ కు అనుగుణంగా లైట్స్  వేశారు.

ఇవి కూడా చదవండి

అమెరికాలోని హ్యూస్టన్‌లో టెస్లా షో

కార్లు బ్యాక్‌డ్రాప్‌లో భారీ పరిమానంలో తన సైనాన్లోని తీసుకుని రామయ్య కదలి వస్తున్నాడు. జీవిత పరిమాణ క్రమంలో ఆయిల్ పెయింటింగ్,  “జై శ్రీ రామ్”  పాట తో ఆ ప్రదేశం ఆధ్యాత్మికతకు నెలవు అనే అనుభూతిని ఇస్తుంది. టెస్లా కార్ డ్రైవర్‌లు సాంగ్ కు అనుగుణంగా హెడ్‌లైట్‌లను ఒకే సమయంలో ఆఫ్ చేయడం,  ఆన్ చేస్తూ రామ్ అనే అక్షరాలు వచ్చ్ విధంగా లైట్స్ ను వెలిగిస్తూ.. ఆర్పుతూ లైట్ షో నిర్వహించారు.

అందమైన లైట్ షో ముగిసిన వెంటనే.. అందరూ హారతి ఇవ్వడానికి ఆలయంలోకి చేరుకున్నారు. ఇతర భక్తులతో కలిసి రాముడు, కృష్ణుడికి సంబంధించిన అద్భుతమైన భజనలు పాడారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

టెస్లా లైట్ షో నిర్వాహకుల ప్రకారం.. ఈ షోలో పాల్గొనే కార్ల యజమానులు ఈవెంట్ కోసం ముందుగానే నమోదు చేసుకున్నారని తెలిపారు. “భద్రతా కారణాల దృష్ట్యా వాహన ప్లేట్ నంబర్‌లను అందించడానికి, ప్రదర్శన కోసం రిజిస్టర్ చేసుకోవాలని.. మాఫీ ఫారమ్‌ను గుర్తించి, సంతకం చేయాలని రామభక్తులందరినీ తాము కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ కారుకు స్క్రీన్-ప్రింటెడ్ టీ-షర్ట్‌తో పాటు మాగ్నెటిక్ డెకాల్ లేదా స్టిక్కర్‌ని పొందారు. అయోధ్య ఆలయం.” డ్రోన్లతో ఫోటోలు తీసినప్పుడు ఎరుపు రంగులో “RAM” అనే అసాధారణ అక్షరం పరిసరాలను ప్రకాశింపజేసే విధంగా కార్లు వరుసలో ఉన్నాయి. ఓ వైపు అత్యంత శీతల గాలులు వీస్తున్నా… ఈ ప్రదర్శన కోసం ఆలయంలో వందలాది మంది పాల్గొన్నారు. ఉత్సాహంగా కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు  షో నిర్వాహకులలో ఒకరైన విశ్వ హిందూ పరిషత్ (VHP)కి చెందిన అచలేష్ అమర్ .

జనవరి మధ్య నుండి విహెచ్ప్ కి చెందిన వారు US లోని 21 రాష్ట్రాలోని  41 నగరాల్లో 51 భారీ కార్ ర్యాలీలను నిర్వహించాము ఆయన చెప్పారు.

 

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..