UHNWI India: ప్రపంచ బిలియనీర్ల క్లబ్‌‌లో మూడో స్థానంలో భారత్.. మరింత పెరుగనున్న సంపన్నుల సంఖ్య..

|

Mar 02, 2022 | 11:15 AM

Ultra high-net-worth individual India: ఈక్విటీ మార్కెట్లు, డిజిటల్ విప్లవం కారణంగా భారతదేశంలో ఎక్కువ నికర ఆస్తులు ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందని అమెరికన్ రియల్ ఎస్టెట్ కంపెనీ నైట్ ఫ్రాంక్

UHNWI India: ప్రపంచ బిలియనీర్ల క్లబ్‌‌లో మూడో స్థానంలో భారత్.. మరింత పెరుగనున్న సంపన్నుల సంఖ్య..
Uhnwi India
Follow us on

Ultra high-net-worth individual India: ఈక్విటీ మార్కెట్లు, డిజిటల్ విప్లవం కారణంగా భారతదేశంలో ఎక్కువ నికర ఆస్తులు ఉన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందని అమెరికన్ రియల్ ఎస్టెట్ కంపెనీ నైట్ ఫ్రాంక్ (Knight Frank) వెల్లడించింది. గత ఏడాది $30 మిలియన్లు (Rs226 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగి ఉన్న అల్ట్రా-హై-నెట్ వర్త్-వ్యక్తుల (UHNWI) సంఖ్య 11 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ జనాభాలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది. అమెరికా 748 బిలియనీర్లతో మొదటి స్థానంలో ఉండగా.. చైనా 554 బిలియనీర్లతో రెండో స్థానంలో.. భారత్ 145 బిలియనీర్లతో మూడో స్థానంలో ఉంది. ది వెల్త్ రిపోర్ట్ 2022 తాజా ఎడిషన్‌లో.. ప్రాపర్టీ కన్సల్టెంట్ ఎజెన్సీ నైట్ ఫ్రాంక్ బిలియనీర్ల జాబితా వివరాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా-హై-నెట్-వర్త్-ఇండివిజువల్ (UHNWIలు) సంఖ్య 2021లో 9.3 శాతం పెరిగి 6,10,569కి చేరింది. ఇది అంతకు ముందు సంవత్సరం 5,58,828గా ఉంది.

భారతదేశంలో UHNWIల సంఖ్య మునుపటి సంవత్సరంలో 12,287 నుంచి 2021లో 13,637కి పెరిగింది. కీలకమైన భారతీయ నగరాల్లో UHNWIల సంఖ్యలో బెంగళూరు అత్యధికంగా 17.1 శాతంతో 352 వృద్ధిని సాధించింది. ఢిల్లీ (12.4 శాతం, 210), ముంబై (9 శాతం, 1,596) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కన్సల్టెంట్ UHNWIల సంఖ్య 2021లో 13,637 నుంచి 2026 నాటికి 39 శాతం పెరిగి 19,006కి చేరింది. 2016లో UHNWIల సంఖ్య 7,401కి చేరుకుంది. దీనిగురించి నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ.. భారత్‌లో UHNWIల వృద్ధికి ఈక్విటీ మార్కెట్లు, డిజిటల్ లావాదేవీలు ప్రధాన కారకాలుగా ఉన్నాయి. భారతదేశంలో యువకులు, స్వీయ-నిర్మిత UHNWIల వృద్ధి అనూహ్యంగా పెరగడంతో మేము వాటిని గణనీయ స్థానానికి తీసుకెళ్లగలమని భావిస్తున్నామన్నారు. కొత్త పెట్టుబడి థీమ్‌లు, ఆవిష్కరణ రంగాలు వృద్ధిలో ముందంజలో ఉన్నాయి.

UHNWI, బిలియనీర్ల జనాభాలో గణనీయమైన వృద్ధితో భారతదేశం దాని ప్రపంచ సహచరులలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలవనుంది. ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని, వివిధ రంగాలలో సూపర్ పవర్‌గా నిలుస్తుందని శిశిర్ బైజల్ పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. భారతదేశంలోని 69 శాతం మంది సూపర్ సంపన్న వ్యక్తులు 2022లో వారి నికర విలువలో 10 శాతానికి పైగా పెరుగుదలను చూసే అవకాశం ఉంది. “బిలియనీర్ల క్లబ్‌లో ఆసియా అగ్రగామిగా కొనసాగుతోంది. 2021లో ప్రపంచంలోని మొత్తం బిలియనీర్లలో దీనివాట 36 శాతంగా ఉంది. 2021లో బిలియనీర్ల జనాభా పరంగా అమెరికా, చైనాల తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది అని నైట్ ఫ్రాంక్ ప్రకటనలో పేర్కొంది. మొదటి సారి, నైట్ ఫ్రాంక్ ప్రపంచంలోని UHNWI సంపన్నుల భవిష్యత్తుతోపాటు ఆస్తి మార్కెట్‌లకు అనుగుణంగా అంచనాలు వేసింది.

ప్రపంచవ్యాప్తంగా.. 135,192 UHNWI సంపన్నులు స్వీయ-నిర్మిత పరంగా 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉంటారని అంచనా వేసింది. మొత్తం UHNWI జనాభాలో దాదాపు ఐదవ వంతు మంది యువకులే ఉన్నారు. భారతదేశం UHNWI జనాభా శాతంలో స్వీయ నిర్మిత వృద్ధిలో 6వ స్థానంలో ఉంది.

Also Read:

US Visa: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్‌ న్యూస్‌.. ఆ షరతును తొలగిస్తూ నిర్ణయం..

Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని భారతీయులకు కీలక సూచనలు.. ఇండియన్ ఎంబసీ కొత్త గైడ్‌లైన్స్ జారీ